
యాదాద్రి జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధర్మోజిగూడెం వద్ద జాతీయ రహదారిపై ఐచర్ వాహనం బోల్తా పడింది. దీంతో వెనుకే వస్తున్న మూడు కార్లు ఐచర్ ను ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్ధితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.