పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు, కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు

By Siva Kodati  |  First Published Aug 7, 2021, 4:36 PM IST

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం శనివారం లేఖ రాసింది. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీరు తరలించకుండా ఆపాలని అందులో విజ్ఞప్తి చేసింది. సాగర్ నీటి అవసరాల కోసం తరలింపు ఆపాలని కోరింది. 


కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం శనివారం లేఖ రాసింది. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీరు తరలించకుండా ఆపాలని అందులో విజ్ఞప్తి చేసింది. సాగర్ నీటి అవసరాల కోసం తరలింపు ఆపాలని కోరింది. అంతేకాకుండా ఏపీ పరిమితికి మించి నీరు తీసుకుంటోందని తెలంగాణ సర్కార్ వాదిస్తోంది. ఏపీ ఇప్పటికే 25 టీఎంసీలు తరలించిందని చెబుతోంది. 

Also Read:రావడం లేదు,మరో రోజు బోర్డు మీటింగ్ పెట్టండి: జీఆర్ఎంబీ ఛైర్మెన్ కు తెలంగాణ ఈఎన్సీ లేఖ

Latest Videos

కాగా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి రాలేమని తెలంగాణ తేల్చి చెప్పింది. ఈ నెల 9వ తేదీన కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరు కావాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నీటి పారుదల శాఖాధికారులకు కేఆర్ఎంబీ ఛైర్మెన్ లేఖ రాశారు.కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గెజిట్ లోని అంశాలను  నిర్ణీత షెడ్యూల్‌లోపుగా పూర్తి చేయాలని కేంద్రజల్ శక్తి కార్యదర్శి బోర్డులకు లేఖ రాశారు.ఈ విషయమై చర్చించేందుకు లేఖలు రాశారు. రెండు రోజుల క్రితం నిర్వహించిన సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరు కాలేదు.
 

click me!