మాజీ ఎమ్మెల్సీ పీఏ కోసం.. రాత్రి 10 గంటలకు ఆఫీసు తెరిచిన వైనం, నిజామాబాద్ రూరల్ ఎమ్మార్వోపై విమర్శలు

Siva Kodati |  
Published : Aug 07, 2021, 04:02 PM IST
మాజీ ఎమ్మెల్సీ పీఏ కోసం.. రాత్రి 10 గంటలకు ఆఫీసు తెరిచిన వైనం, నిజామాబాద్ రూరల్ ఎమ్మార్వోపై విమర్శలు

సారాంశం

నిజామాబాద్ రూరల్ ఎమ్మార్వో ఆఫీసులోకి మాజీ ఎమ్మెల్సీ పీఏ రాకపై తీవ్ర స్థాయిలో దుమారం రేగుతోంది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పీఏ ఎమ్మార్వో ఆఫీసులోకి వెళ్లారు.

నిజామాబాద్ రూరల్ ఎమ్మార్వో ఆఫీసులోకి మాజీ ఎమ్మెల్సీ పీఏ రాకపై తీవ్ర స్థాయిలో దుమారం రేగుతోంది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పీఏ ఎమ్మార్వో ఆఫీసులోకి వెళ్లారు. ఇటీవలే ఓ స్థలం విషయంలో ఆకుల లలితపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎమ్మార్వో కార్యాలయం ఓపెన్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఎమ్మార్వో ప్రశాంత్  స్పందించారు. మాజీ ఎమ్మెల్సీ పీఏ నిన్న రాత్రి కార్యాలయానికి వచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఏదో స్లాట్ విషయంలో అనుమానం వుంటే వచ్చారని.. ఆ  సమయంలో కార్యాలయంలో సిబ్బంది వున్నారని, తాను లేనని ప్రశాంత్ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి CM రేవంత్ రెడ్డి బోనాలు | Secunderabad Ujjaini Mahankali Bonalu 2026
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి తొలి దర్శనం | First Darshan of Ujjaini Mahankali Temple | Bonalu 2026