New Year Celebrations: న్యూ ఇయర్ గిఫ్ట్ గా రేవంత్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారిసెలవుల జాబితాలో మార్పులు చేస్తూ.. కొత్త ఏడాది జనవరి 1న సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
New Year Celebrations: న్యూ ఇయర్ సందర్భంగా రేవంత్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు ఓ శుభవార్త చెప్పింది. కొత్త సంవత్సర వేడుకలను మరి సంతోషంగా జరుపుకోవడానికి వీలుగా.. జనవరి 1 ని జనరల్ హాలిడేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల జాబితాలో రేవంత్ సర్కారు మార్పులు చేసింది.
అయితే.. జనవరి 1న సెలవు ఇచ్చినందున ఫిబ్రవరిలోని రెండో శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మార్పును ఉద్యోగులందరూ గమనించాలని సూచించింది. కాగా డిసెంబర్ 31వ తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజు వేడుకల్లో పాల్గొనే ఉద్యోగులు అలసిపోతారని, అందుకే వారి సౌకర్యం కోసం జనవరి 1న సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది
మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలకు మరింత సంతోషంగా జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 31 రాత్రి 1 గంట వరకు వేడుకలు జరుపుకోవడానికి అనుమతించనున్నట్లు తెలిపింది. పబ్‌లు, క్లబ్‌లు, బార్, రెస్టారెంట్లు, హోటళ్లు ఒంటి గంట వరకు తెరచుకునేందుకు వీలు కల్పించింది.
అయితే.. ముందస్తు అనుమతి తప్పనిసరని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. అలాగే.. నూతన సంవత్సర వేడుకల కోసం పార్టీలకు వెళ్లేవారు , పబ్‌లు, క్లబ్‌లు, ఇతర పార్టీల నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలలో డ్రగ్స్ ను వినియోగిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.