తెలంగాణలో మరోసారి సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో సమగ్ర కుటుంబ తరహా సర్వేను నిర్వహించాలన్నది ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో మరోసారి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఈ నెల 28వ తారీకు నుంచి వచ్చే నెల ఆరో తారీకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే సమగ్ర కుటుంబ తరహా సర్వే చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రతి కుటుంబం వివరాలు పూర్తిస్థాయిలో సేకరించాలని ప్రభుత్వం అనుకుంటుంది. తద్వారా ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అర్హులకు చేర్చడానికి ఈ కుటుంబ సర్వే ఉపయోగపడుతుందని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.
గత ప్రభుత్వం నిర్వహించిన సర్వేకు భిన్నంగా ఈ సర్వేలో సమగ్రంగా 32 రకాల సమాచారం సేకరించి, ప్రతి కుటుంబాన్ని సూక్ష్మంగా పరిశీలించడానికి రేవంత్ సర్కారు సూచనప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే.. ఈ సర్వే ద్వారా ప్రతీ కుటుంబానికి ఉన్న భూములు, ఇళ్లు, ఉద్యోగం, వ్యాపారం, ఆదాయం, వాహనాలు, గ్యాస్ కనెక్షన్లు తదితర వివరాలను సేకరించనున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 ఆగస్టు 19న ఒకేరోజు సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించింది. అయితే.. ఆ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదనే విషయం తెలిసిందే.