
హైదరాబాద్:హైదరాబాద్ రాజ్‌భవన్ స్కూల్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం నాడు పరిశీలించారు. తెలంగాణలో ఇవాళ్టి నుండి విద్యా సంస్థలు పున:ప్రారంభమయ్యాయి. 18 మాసాల తర్వాత విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. ఇవాళ రాజ్‌భవన్ స్కూల్ ను గవర్నర్ తమిళిపై సౌందరరాజన్ పరిశీలించారు. స్కూల్ కు వచ్చిన విద్యార్థులతో ఆమె ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
also read:మోగిన బడిగంట: తెలంగాణలో 18 నెలల తర్వాత స్కూల్స్ రీఓపెన్
విద్యార్థులకు మాస్క్ ధరించడంపై అవగాహన ఉందన్నారు. చిన్న పిల్లలు మాత్రమే మాస్క్ సరిగా పెట్టుకోవడం లేదన్నారు. విద్యార్థులతో మాట్లాడడం సంతోషంగా ఉందని గవర్నర్ తమిళిసై చెప్పారు. చిన్నారులకు వ్యాక్సినేషన్ ను త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులను ధైర్యంగా స్కూల్స్ కు పంపుతున్న పేరేంట్స్ ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందించారు.
కేజీ నుండి పీజీ వరకు అన్ని విద్యా సంస్థలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రైవేట్ టీచర్ బాలకృష్ణ దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు మంగళవారం నాడు విచారణ నిర్వహించింది. ప్రత్యక్ష క్లాసుల విషయంలో నిర్ణయాన్ని విద్యాసంస్థలకే వదిలేసింది. ప్రత్యక్ష క్లాసులకు హాజరు కావాలని విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావొద్దని కూడ హైకోర్టు ఆదేశించింది.రెసిడెన్షియల్స్, హాస్టల్స్ తెరవకూడదని హైకోర్టు స్పష్టం చేసింది.