
కరీంనగర్: పురిటి నొప్పులతో మాతాశిశు కేంద్రంలో చేరిన ఓ మహిళా కానిస్టేబుల్ మృతిచెందిన విషాదం కరీంనగర్ లో చోటుచేసుకుంది. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గర్భిణి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లా కేశవపట్నం పోలీస్ స్టేషన్ లో హసినా బేగం కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. అయితే ఆమె గర్భంతో వుండటంతో కొంతకాలంగా మెటర్నిటీ లీవ్ లో వుంది. తాజాగా ఆమెకు నెలలు నిండుకుని పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు కరీంనగర్ పట్టణంలోని మాతా శిశు కేంద్రానికి తరలించారు.
read more బోటి కూర వేడిచేయలేదని.. కాగిన నూనె పోసి.. యువకుడిని చితకబాది రభస...
అయితే ప్రసవ సమయంలో హసీనా పరిస్థితి క్షీణించి బిడ్డను ప్రసవించకుండానే మృత్యువాతపడింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణి మృతిచెందినట్లు ఆరోపిస్తూ కుటుంబసభ్యులు హాస్పిటల్ ముందే ఆందోళనకు దిగారు.
మృతురాలి కుటుంబసభ్యుల ఆందోళనతో హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళా కానిస్టేబుల్ కుటుంబాన్ని సముదాయించి ఆందోళనను విరమించేలా చేశారు. వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు.