బోటి కూర వేడిచేయలేదని.. కాగిన నూనె పోసి.. యువకుడిని చితకబాది రభస...

Published : Sep 01, 2021, 09:56 AM IST
బోటి కూర వేడిచేయలేదని.. కాగిన నూనె పోసి.. యువకుడిని చితకబాది రభస...

సారాంశం

మల్లాపూర్ లోని ఓ వైన్స్ పర్మిట్ రూంలో మీర్ పేట్ హెచ్ బీ కాలనీకి చెందిన ధర్మేందర్ సోమవారం రాత్రి మద్యం తాగుతున్నాడు. మల్లాపూర్ కు చెందిన శివకుమార్ అక్కడికి వెళ్లాడు. అప్పటికే మత్తులో ఉన్న ధర్మేందర్ బోటి కూర వేడి చేసుకుని రావాలని నిర్వాహకుడిని విసిగించడమే కాక గట్టిగా కేకలు పెట్టాడు.

హైదరాబాద్ : బోటి కూర వేడి చేసుకుని రావాలని ఓ యువకుడు నిర్వాహకుడిని విసిగించాడు. గమనించిన మరో యువకుడు మందలించగా అతనిమీద వేడి నూనె పోసి దాడి చేసిన ఘటన నాచారం ఠాణా పరిథిలో జరిగింది. 

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్ లోని ఓ వైన్స్ పర్మిట్ రూంలో మీర్ పేట్ హెచ్ బీ కాలనీకి చెందిన ధర్మేందర్ సోమవారం రాత్రి మద్యం తాగుతున్నాడు. మల్లాపూర్ కు చెందిన శివకుమార్ అక్కడికి వెళ్లాడు. 

అప్పటికే మత్తులో ఉన్న ధర్మేందర్ బోటి కూర వేడి చేసుకుని రావాలని నిర్వాహకుడిని విసిగించడమే కాక గట్టిగా కేకలు పెట్టాడు. దీంతో శివకుమార్ ఎందుకలా చేస్తున్నావ్, సరికాదంటూ హెచ్చరించాడు. 

దీంతో కోపానికి వచ్చిన ధర్మేందర్ స్నేహితులు ముగ్గురు.. నువ్వు నాకు చెప్పేదేమిటంటూ.. శివకుమార్ పై బండరాయితో దాడి చేశారు. ఆ పై పక్కనే ఉన్న బజ్జీల కడాయిలో కాగుతున్న నూనె ఆయన మీద పోశారు. తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.