7 గంటలకు వస్తానని కేసీఆర్ సమాచారం ఇచ్చారు: ఎట్ హోం కార్యక్రమంపై తమిళిసై

By narsimha lodeFirst Published Aug 15, 2022, 9:23 PM IST
Highlights


ఎట్ హోం కార్యక్రమానికి రావడం లేదని కేసీఆర్ నుండి సమాచారం రాలేదని  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు.  కానీ ఈ కార్యక్రమానికి ఏడు గంటలకు వస్తున్నట్టుగా తమకు సమాచారం ఇచ్చినట్టుగా గవర్నర్ చెప్పారు.

హైదరాబాద్:ఎట్ హోం కార్యక్రమానికి  సాయంత్రం ఏడు గంటలకు వస్తానని  తెలంగాణ సీఎం కేసీఆర్ తమకు సమాచారం ఇచ్చారని గవర్నర్ తమిళిపై సౌందర రాజన్ చెప్పారు. అయితే ఈ కార్యక్రమానకి హాజరు కావవడం లేదని కేసీఆర్ నుండి సమాచారం రాలేదన్నా,రు.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్ భవన్ లో సోమవారం నాడు సాయంత్రం ఏడు గంటలకు రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమాన్ని తమిళిసై సౌందర రాజన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని అందరికీ రాజ్ భవన్ నుండి ఆహ్వానాలు వెళ్లాయి. తెలంగాణ సీఎం ేకసీఆర్ కు కూడా ఆహ్వానాలు వెళ్లింది. అయితే ఇవాళ సాయంత్రం ఏడు గంటలకు రాజ్ భవన్ కు చేరుకుంటానని తనకు సమాచారం అందిందని గవర్నర్ చెప్పారు. సీఎం కేసీఆర్ కోసం 20 నిమిషాల పాటు ఎట్ కార్యక్రమం ప్రారంభించకుండా  ఎదురు చూసినట్టుగా గవర్నర్ మీడియాకు చెప్పారు. అయితే కేసీఆర్ ఈ కార్యక్రమానికి రావడం లేదని సమాచారం తమకు అందలేదన్నారు.  ఎట్ హోం కార్యక్రమం సందర్బంగా గవర్నర్ మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు మధ్య మరింత దూరం పెరిగిందని ఈ ఘటన  రుజువు చేసింది. 

9 మాపాల తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ఏడాది జూన్ 28వ తేదీన రాజ్ భవన్లో అడుగు పెట్టారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ తర్వాత జరిగిన  ఇవాళ జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొనాల్సి ఉంది. కానీ కేసీఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. 


 చాలా కాలంగా తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తుందని జరుగుతున్న ఘటనలను చూస్తే అర్ధమౌతుంది. రాష్ట్ర సీఎం కేసీఆర్ తీరును గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చేసిన విమర్శలపై  టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు  తమిళిసైకి కాదు రాజ్ భవన్ కు గౌరవం ఇవ్వాలని ఆమె కోరారు. తాను రబ్బర్ స్టాంప్ ను కాదని కూడా గతంలో వ్యాఖ్యలు చేశారు.

also read:తెలంగాణ రాజ్ భవన్ లో గవర్నర్ ఎట్ హోం ప్రోగ్రాం: కేసీఆర్ గైర్హాజర్

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ తమిళిసై  ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు ఆ  సమయంలో కేసీఆర్ తీరుపై మీడియా వేదికగా గవర్నర్ వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు, మంత్రులు కూడా అంతే స్థాయిలో విమర్శలు చేశారు. అంతేకాదు తనను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారని కూడా గవర్నర్ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తనకు ప్రోటోకాల్ ఇవ్వడం మానేసిందని కూడా గవర్నర్ ఈ నెల 8వ తేదీన వ్యాఖ్యానించారు. బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించిన సమయంలో  మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

click me!