తెలంగాణ రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఎట్ హోం కార్యక్రమానికి కేసీఆర్ తొలుత వస్తారని మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ రాజ్ భవన్ కు కేసీఆర్ దూరంగా ఉన్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యారు.. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరౌతారని తొలుత మీడియా కథనాలు ప్రసారం చేసింది. అయితే ఎట్ హోం కార్యక్రమం ప్రారంభమైనా కూడా సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఎట్ హోం కార్యక్రమానికి మంత్రులు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎవరూ కూడా హాజరు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిసోమేష్ కుమార్ , అధికారులు మాత్రం హాజరయ్యారు.
also read:75 th Independence Day: రాజ్ భవన్ ఎట్ హోంకు హాజరు కానున్న కేసీఆర్
undefined
తొలుత ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్టుగా సీఎంఓ అధికారుులు రాజ్ భవన్ సమాచారంం పంపారని ప్రచారం సాగింది. అయితే చివరి నిమిషంలో ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని సీఎం నిర్ణయించుకొన్నారని తెలుస్తుంది. సీఎం కేసీఆర్ కోసం సుమారు 20 నిమిషాల పాటు తమిళిసై సౌందర రాజన్ ఎదురు చూసినట్టుగా మీడియా చానెల్స్ కథనాలు ప్రసారం చేశాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ కు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు మధ్య అగాధం పెరుగుతూనే ఉందని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఈ ఏడాది జూన్ 28న తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఆ సమయంలో కేసీఆర్ గవర్నర్ తమిళిసైతో నవ్వుతూ కన్పించారు. చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు తొమ్మిది మాసాల తర్వాత కేసీఆర్ రాజ్ భవన్ లో అడుగు పెట్టారు. ఇవాళ ఎట్ హోం కార్యక్రమానికి కేసీఆర్ హాజరౌతారా లేదా అనే ఉత్కంఠ కొనసాగింది. అయితే తొలుత ఈ కార్యక్రమానికి హాజరౌతారని ప్రచారం సాగింది. కానీ చివరికి కేసీఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. ప్రోటోకాల్ విషయంలో మార్పు రాలేదని చెప్పారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఢిల్లీలో కూడా కేసీఆర్ పై గవర్నర్ విమర్శలు చేశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ చేసిన క్లోడ్ బరస్ట్ వ్యాఖ్యలను ఆమె తోసిపుచ్చారు. అంతేకాదు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లరని కూడా ఆమె తేల్చి చెప్పారు. అంతేకాదు యూనివర్విటీల్లో కూడా గవర్నర్ పర్యటించారుఅంతేకాదు యూనివర్శిటీల్లో కూడా గవర్నర్ పర్యటించారు.