
న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్ Tamilisai Soundararajan ఆదివారం నాడు ఢిల్లీకి చేరుకొన్నారు.. ఈ నెల 18న ప్రధానమంత్రి Narendra Modi తో పాటు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.
12 రోజుల వ్యవధిలోనే Telangana గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ Delhi పెద్దలను కలిసేందుకు రావడం ప్రస్తుతం చర్చకు దారితీసింది. ఢిల్లీ నుండి Hyderabad కు వచ్చిన తర్వాత భద్రాద్రి ఆలయంలో జరిగిన శ్రీరాముడి పట్టాభిషేకోత్సవంలో Governor పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో కూడా అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు. ప్రోటోకాల్ పాటించని విషయమై ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్పానన్నారు. తాను ప్రజల కోసం పనిచేస్తున్నానని గవర్నర్ చెప్పారు.
ఈ నెల 6వ తేదీన న్యూఢిల్లీలో ప్రధాని Narendra modiతో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాత తెలంగాణ ప్రభుత్వంపై ఆమె విమర్శలు చేశారు. ఈ నెల 7న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కూడా ఆమె సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత కూడా తాను చేసిన విమర్శలకు టీఆర్ఎస్ వైపు నుండి వచ్చిన విమర్శలకు కౌంటరిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం తనను అవమానపరుస్తుందన్నారు. రాజ్యాంగం ప్రకారంగానే తాను నడుచుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. కానీ అలా చేయడం టీఆర్ఎస్ సర్కార్ కు ఇబ్బందిగా మారితే తాను ఏం చేయలేనన్నారు. కేసీఆర్ ను తాను సోదరుడిగా భావించానన్నారు. కానీ తనను అవమానిస్తున్నారన్నారు. రాజ్ భవన్ కు ఇచ్చే గౌరవాన్ని ఇవ్వాలన్నారు. గవర్నర్ చేసిన విమర్శలకు టీఆర్ఎస్ నేతలు, మంత్రులు కూడా అంతే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు.
గత కొంతకాలంగా తెలంగాణలో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య దూరం పెరిగింది. ఈ విబేధాలు ఇటీవల తారాస్థాయికి చేరకున్నాయి. నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాలో కౌశిక్ రెడ్డిని పేరును కేబినెట్ సిఫారసు చేయగా.. గవర్నర్ దానికి ఆమోదం తెలుపలేదు. అప్పటి నుంచి గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. రాజ్ భవన్‌లో గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరుకాలేదు.
సమక్క సారక్క జాతరలో పాల్గొనడానికి వెళ్లిన గవర్నర్‌కు ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆహ్వానించడానికి రాలేదు. దీంతో ప్రోటోకాల్ పాటించలేదనే విమర్శలు వినిపించాయి. ఇందుకు సంబంధించి ఫిర్యాదులు అందడంతో ఇప్పటికే కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. గవర్నర్ తమిళిసై హన్మకొండ, యాదాద్రి పర్యటనల సందర్భంగా మంత్రులు, అధికారులు ప్రోటోకాల్ పారించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిణామాలపై తమిళిసై వివిధ సందర్భాల్లో బహిరంగ వ్యాఖ్యలు కూడా చేశారు.
తాజాగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులను హాజరుకాలేదు. ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ హోదాలో తన పరిమితులు ఏంటో తనకు తెలుసునన్నారు. తనను ఎవరూ నియంత్రించలేరని తమిళిసై వ్యాఖ్యానించారు. తనకు ఎలాంటి ఇగో లేదని.. ప్రజల సమస్యల కోసం గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేశామని ఆమె పేర్కొన్నారు. అందరితో సఖ్యతగా వుండటమే తనకు తెలుసునని తమిళిసై పేర్కొన్నారు. రాజ్‌భవన్ తెలంగాణ ప్రజల మేలు కోసమే వుందన్నారు. వచ్చే నెల నుంచి రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని తమిళిసై వెల్లడించారు.