రామకృష్ణతో పెళ్లి మా నాన్నకు ఇష్టం లేదు: పరువు హత్యకు గురైన రామకృష్ణ భార్య భార్గవి

Published : Apr 17, 2022, 04:36 PM IST
 రామకృష్ణతో పెళ్లి మా నాన్నకు ఇష్టం లేదు: పరువు హత్యకు గురైన రామకృష్ణ భార్య భార్గవి

సారాంశం

రామకృష్ణను పెళ్లి చేసుకోవడం మా నాన్నకు ఇష్టం లేదని పరువు హత్యకు గురైన రామకృష్ణ భార్య భార్గవి చెప్పారు.  తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. 

భువనగిరి: రామకృష్ణను పెళ్లి చేసుకోవడం మా నాన్నకు ఇష్టం లేదని పరువు హత్యకు గురైన  Ramakrishna  భార్య భార్గవి  తెలిపింది. ఆదివారం నాడు ఓ తెలుగు న్యూస్ చానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. తాను ఇంటర్ చదివే సమయంలో రామకృష్ణతో తనకు పరిచయం ఏర్పడిందన్నారు.ఆ సమయంలో రామకృష్ణ home guardగా పనిచేసేవాడని ఆమె చెప్పారు.ఈ పరిచయం తమ మధ్య  ప్రేమకు దారి తీసిందన్నారు.  అయితే ఈ ప్రేమతో తాను ఇంటర్ ఫెయిల్ అయ్యాయన్నారు. ఆ తర్వాత ఇంటర్ పరీక్షలో పాసైన తర్వాత డిగ్రీ చదివే రోజుల్లో కూడా తమ ప్రేమ కొనసాగిందన్నారు. అ అయితే ఈ విషయం తమ తండ్రికి తెలిసి తనను కొట్టాడనని Bhargavi చెప్పారు.  ఆ తర్వాత కూడా తాను రామకృష్ణతో ఫోన్ లో మాట్లాడేదాన్ని అని ఆమె చెప్పారు. 

20220 ఆగష్టు 16న  తాను ఇంటికి సమీపంలో కారులో రామకృష్ణ రావడంతో అతడితో తాను వెళ్లిపోయినట్టుగా ఆమె చెప్పారు. అదే రోజున marriage చేసుకొన్నానని ఆమె గుర్తు చేసుకొన్నారు. పెళ్లి తర్వాత తమ వారికి దొరకకుండా తప్పించుకొని తిరిగామన్నారు. సూర్యాపేట, నల్గొండ, యూసుఫ్ గూడల్లో తలదాచుకొన్నామన్నారు. అయతే తాము నల్గొండలో ఉన్న సమయంలో తమ తండ్రి తనను kidnap చేశారన్నారు. ఆ సమయంలో తాను  నానా రచ్చ చేసినట్టుగా చెప్పారు. ఈ విషయమై తన భర్త రామకృష్ణ కూడా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు తమ కుటుంబంతో పాటు   రామకృష్ణ కుటుంబాన్ని పిలిపించారన్నారు. అయితే ఆ సమయంలో తాను రామకృష్ణతో ఉంటానని తేగేసి చెప్పడంతో పోలీసులు తనను రామకృష్ణతో పంపించినట్టుగా భార్గవి చెప్పారు. తాము  లింగరాజుపల్లిలో చాలా కాలంగా ఉన్నామన్నారు. తాను ఐదు మాసాల  గర్భవతిగా ఉండడంతో భువనగిరికి  మకాం మార్చామన్నారు.గత వారమే తన  కూతురు అన్నప్రాస చేయించామని రామకృష్ణ భార్య  భార్గవి చెప్పారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్