
హైదరాబాద్ జవహర్ నగర్‌లో మహిళను వివస్త్రను చేసిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తనకు నివేదిక సమర్పించాల్సిందిగా సీఎస్, డీజీపీలను ఆమె ఆదేశించారు.
అసలేం జరిగిందంటే :
మద్యం మత్తులో ఓ కామాంధుడు యువతిపై దారుణానికి తెగబడ్డాడు. ఈ నెల 6న హైదరాబాద్ జవహర్‌నగర్‌లో ఓ యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో మారయ్య అనే వ్యక్తి ఆమెపై చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ హఠాత్ పరిణామానికి షాకైన ఆ యువతి అతనిని దూరంగా నెట్టేసింది. దీంతో ఆ కీచకుడు ఆమెపై దాడి చేశాడు. అక్కడితో ఆగకుండా ఆమె బట్టలను చించి లాగేశాడు. ఆమె దాదాపు 15 నిమిషాల పాటు రోడ్డుపై నగ్నంగా పడివున్నా పట్టించుకున్న వారు లేరు. అంతా ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ చోద్యం చూశారు. ఈ ఘటన జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించగా.. జాతీయ మహిళా కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.
Also Read: హైద్రాబాద్ జవహర్ నగర్ లో యువతిని వివస్త్ర చేసిన కేసు: వారం రోజుల్లో నివేదిక కోరిన జాతీయ మహిళ కమిషన్