నాకు, కేసీఆర్‌కు మధ్య నాట్ ఫైటింగ్, నాట్ ఫేవరింగ్: తమిళిసై ఆసక్తికరం

Published : Feb 12, 2021, 02:43 PM ISTUpdated : Feb 12, 2021, 03:33 PM IST
నాకు, కేసీఆర్‌కు మధ్య నాట్ ఫైటింగ్, నాట్ ఫేవరింగ్: తమిళిసై ఆసక్తికరం

సారాంశం

తనకు, సీఎంకి మధ్య సంబంధం నాట్ ఫైటింగ్, నాట్ ఫేవరింగ్ అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు.

హైదరాబాద్: తనకు, సీఎంకి మధ్య సంబంధం నాట్ ఫైటింగ్, నాట్ ఫేవరింగ్ అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు.

మూవింగ్ ఫార్వార్డ్ విత్ మెమొరీస్ ఆఫ్ మెయిడెన్ ఇయర్ పుస్తకాన్ని గవర్నర్ తమిళిసై శుక్రవారం నాడు విడుదల చేశారు.గవర్నర్ గా తన ఏడాది అనుభవాలను ఆమె ఈ పుస్తకంలో పొందుపర్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి తీవ్రంగా ఉందన్నారు. దీనిపై ప్రభుత్వానికి లేఖ రాస్తే సానుకూలంగా స్పందించిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకొన్నారు.


. గవర్నర్ పదవి విశ్రాంతి కోసం కాదన్నారు. గవర్నర్, సీఎం ఆఫీసులు ప్రజల కోసమే పనిచేయాలని ఆమె తెలిపారు. ప్రభుత్వానికి నాకు కాంట్రవర్సీలు ఉంటాయని అనుకొన్నారన్నారు. కానీ మంచి కమ్యూనికేషన్ ఉంటే కాంట్రవర్సీకి ఛాన్సే లేదన్నారు.

నెల రోజుల్లో  వీసీలను నియమిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితిపై కామెంట్ చేయబోనని ఆమె తేల్చి చెప్పారు. గవర్నర్ పదవిలో ఉంటూ రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు. త్వరలోనే గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తానని ఆమె తెలిపారు.

రాస్ట్రంలో యూనివర్శిటీలకు వీసీలు లేకపోవడంపై ఇటీవల గవర్నర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఈ విషయమై ప్రభుత్వం స్పందించిందని గవర్నర్ తమిళి సై ఇవాళ తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Richest District : ఇండియాలో రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? ముంబై, ఢిల్లీ కానే కాదు !
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో జల్లులు