తరగతి గదిలోనే ఉరేసుకుని... ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Arun Kumar P   | Asianet News
Published : Feb 12, 2021, 10:28 AM IST
తరగతి గదిలోనే ఉరేసుకుని... ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

సారాంశం

రోజులాగే కళాశాలకు వెళ్లిన ఓ యువకుడు ఎవ్వరూ లేని సమయంలో తరగతి గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

మహబూబ్ నగర్: తరగతి గదిలోనే ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇటీవలే కన్నతల్లి చనిపోవడంతో తట్టుకోలేకపోయిన యువకడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.  

వివరాల్లోకి వెళితే...  ధన్వాడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన యువకుడు బాలరాజు ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే 15రోజుల క్రితం అనారోగ్యంతో అతడి తల్లి మరణించింది. దీంతో బాలరాజు తల్లి పోయిన బాధనుండి తేరుకోలేకపోతున్నాడు.  

ఈ క్రమంలోనే తల్లి లేకుండా బ్రతకలేక దారుణ నిర్ణయం తీసుకున్నాడు. రోజులాగే కళాశాలకు వెళ్లిన అతడు ఎవ్వరూ లేని సమయంలో తరగతి గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో వారు పోలీసులకు తెలియజేశారు. 

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే పనిలోపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?