బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇష్టారీతిగా మాట్లాడితే.. చూస్తు ఊరుకోమని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన టీఆర్ఎస్ జిల్లా స్థాయి మీటింగ్ లో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.ఓపికకు హద్దులుంటాయని.. హద్దు దాటి మాట్లాడొద్దని, ఎగిరెగిరి పడొద్దని.. తాము తిరగబడితే ప్రధానమంత్రిని కూడా విడిచిపెట్టమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇష్టారీతిగా మాట్లాడితే.. చూస్తు ఊరుకోమని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన టీఆర్ఎస్ జిల్లా స్థాయి మీటింగ్ లో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.ఓపికకు హద్దులుంటాయని.. హద్దు దాటి మాట్లాడొద్దని, ఎగిరెగిరి పడొద్దని.. తాము తిరగబడితే ప్రధానమంత్రిని కూడా విడిచిపెట్టమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓపిక నశిస్తే ప్రధాన మంత్రిని, కేంద్రమంత్రులను కూడా ఒదిలిపెట్టం. రాజకీయాలకు సమయం సందర్భం ఉంటుంది. మా ఓపికను, సహనాన్ని అసమర్ధతగా భావించొద్దు. 20 ఏళ్లలో గెలుపోటములను ఎన్నో చూసాం. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసామని, తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రులను ఉరికించామని కేటీఆర్ అన్నారు.
undefined
టీ-కాంగ్రెస్, టీ-బీజేపీ నాయకులను ఆనాడు గంజిలో ఈగల్లెక్క ఆంధ్రా నాయకులు తీసేసారు. ఆనాడు మీ బతుకులేందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండన్నారు. రాయలసీమ నాయకుల ముందు చేతులు కట్టుకుని నిల్చున్న బతుకులు మీవి. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే ఒక్కడన్నా ముందుకొచ్చిండా? అని సూటి ప్రశ్న వేశారు.
ఎట్టిపనికైనా, మట్టిపనికైనా మనోడుండాలని ప్రొ.జయశంకర్ చెబుతుండేవాడు. అందుకే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఏనాటికైనా శ్రీరామరక్ష టీఆర్ఎస్ మాత్రమే. ఏ రాష్ట్రానికి పోతే, ఆ రాష్ట్ర ప్రయోజనాలకోసం మాట్లాడే పార్టీలు మన ఆకాంక్షలు నెరవేర్చలేవంటూ జాతీయ పార్టీ మీద దుమ్మెత్తిపోశారు.
తెలంగాణ కోసం త్రికరణ శుద్ధిగా అభివృద్ధిని, సంక్షేమాన్ని అమలు చేస్తున్న నేత కేసీఆర్ అన్నారు. కేసీఆర్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని దివంగత అరుణ్ జైట్లీ చెప్పారని గుర్తు చేశారు.
100 శాతం నీళ్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర నాయకులు చెబుతుంటే.. ఇక్కడున్న ఇద్దరు సన్నాసులు మాత్రం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమేసిన రాష్ట్రం తెలంగాణ అని పార్లమెంట్ లో కేంద్రమే ఒప్పుకుందని అన్నారు.
అంతేకాదు తెలుగు గడ్డమీద పుట్టిన ప్రాంతీయ పార్టీల్లో బతికి బట్టకట్టినవి రెండే రెండు. ఒకటి టీడీపీ, రెండోది టీఆర్ఎస్ అన్నారు. తెలంగాణ సాధన లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్ రాష్ట్రం సాధించడంతో, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తోందన్నారు.
రెండు దశాబ్దాల కిందట తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరాలని కేసీఆర్ సమాలోచనలు చేసి పార్టీని స్థాపించారు. ఆనాడు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటంతో పాటు అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి ఉండేవారు.
ఇంకోవైపు తెలంగాణ ఆకాంక్షను దశాబ్దాల పాటు అణగదొక్కిన కాంగ్రెస్, ఒక్కరాష్ట్రం రెండు రాష్ట్రాలని చెప్పి మోసం చేసిన బీజేపీ లాంటి మూడు దిగ్గజ పార్టీలను ఎదిరించి కేసీఆర్ నిలబడ్డారు.
జయశంకర్ లాంటి మేధావులు తెలంగాణ ఆకాంక్షను నిలబెడుతూ వచ్చినా ముందుకు తీసుకెళ్లే నాయకుడు లేక తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో కేసీఆర్ ఆ బాధ్యత తీసుకున్నారు. ఆనాడు ఏవీ మనకు అనుకూలంగా లేకున్నా ఒక్కడుగా కేసీఆర్ బయలుదేరారు.
మీడియా వాళ్లు, వ్యాపారులు రాష్ట్ర ఆకాంక్షకు మద్ధతు ఇవ్వలేదు. ఇదేం జెండా, ఇదే పార్టీ అని కేసీఆర్ ను ఎందరో అపహాస్యం చేసినా ఒక్కడే రాష్ట్ర సాధన కోసం బయలుదేరారు. కేంద్రం, రాజకీయ వ్యవస్థలన్నీ వ్యతిరేకించిన సమయంలో ప్రజల మద్ధతుతో కేసీఆర్ ముందుకు సాగారు.
47 ఏళ్ల వయస్సులో త్యాగం చేసి, ధైర్యం చేసి పార్టీని స్థాపించడంతో పాటు ప్రజల అనుమానాలు పటాపంచాలు చేస్తూ ఉద్యమాన్ని నడిపించారు. పార్టీ స్థాపించిన రోజే తనకున్న మూడు పదవులను వదిలేసారు. రాష్ట్రం వచ్చేదాకా తెలంగాణ ఉద్యమాన్ని వదిలిపెడితే రాళ్లతో కొట్టి చంపాలని చెప్పిన ధైర్యమున్న నేత కేసీఆర్ అని చెప్పుకొచ్చారు.
ఇంతటి సాహసోపేతమైన మాట చెప్పిన నాయకుడు దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. అలాంటి కేసీఆర్ ను నిన్న, ఇయ్యాల పుట్టిన నాయకులు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
టీ కాంగ్రెస్, టీ బీజేపీ నాయకుల్లారా మీ బతుకులకు ఆ పదవులు తెలంగాణ వల్లే వచ్చాయని ధ్వజమెత్తారు. కేసీఆర్ లేకపోతే మీకు ఆ పదవులెక్కడివి? ఆయన పదవికి, వయస్సుకు కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నారు. రెండు మూడు నెలలకింద వచ్చినోడే అట్లా మాట్లాడితే మనమెన్ని మాట్లాడాలే? 1, 2 సీట్లు గెలిచినోల్లు ఎగిరెగిరి పడితే.. పంచాయితీ నుంచి అసెంబ్లీ దాకా 90 శాతం సీట్లు గెలిచిన మేమెంత ఎగరాలే? అంటూ విరుచుకుపడ్డారు.