ఉస్మానియా ఆసుపత్రిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సోమవారంనాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరో వైపు హరీష్ రావు ఉస్మానియా ఆసుపత్రిపై హరీష్ రావు సమీక్ష నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సోమవారంనాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదే సమయంలో మంత్రి హరీష్ రావు ఉస్మానియాపై సమీక్ష నిర్వహిస్తున్నారు.
ఉస్మానియా ఆసుపత్రి విషయమై ఇచ్చిన హామీలను అమలు చేయాలని తమిళిసై సౌందర రాజన్ ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ట్వీట్ పై తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికార ప్రతినిధిలా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వ్యవహారిస్తున్నారని హరీష్ రావు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉస్మానియా ఆసుపత్రిని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆకస్మికంగా తనిఖీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉస్మానియా ఆసుపత్రిలోని పలు వార్డులను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పరిశీలించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ 2015లో ఉస్మానియా ఆసుపత్రిని పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనం స్థానంలో ట్విన్ టవర్స్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉస్మానియా ఆసుపత్రి భవనం కూల్చివేతను నిరసిస్తూ కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో కొత్త భవన నిర్మాణ పనుల విషయంలో ముందుకు సాగడం లేదని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
also Read:రబ్బరుస్టాంప్ గవర్నర్లే నచ్చుతారు: హరీష్‌రావుకు బండి సంజయ్ కౌంటర్
ఉస్మానియాపై మంత్రి హరీష్ రావు సమీక్ష
ఇదిలా ఉంటే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉస్మానియా ఆసుపత్రిపై సోమవారంనాడు సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ఇవాళ మధ్యాహ్నం నిమ్స్ లో కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు వాయిదా వేసుకున్నారు. నిమ్స్ కార్యక్రమాన్ని సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేశారు. నిమ్స్ కార్యక్రమం నిర్వహించాల్సిన సమయంలో ఉస్మానియాపై మంత్రి హరీష్ రావు సమీక్షను చేపట్టారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, వాణీ దేవి, రహమత్ బెగ్, హసన్ ఎఫెండి, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, దానం నాగేందర్, గోపీనాథ్, జాఫర్ హుస్సేన్, కౌసర్ మోయినుద్దీన్, హెల్త్ సెక్రటరీ రిజ్వి, సీఎం ఓఎస్డీ గంగాధర్, ఇ ఎన్ సి గణపతి రెడ్డి, ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.