న్యూఢిల్లీకి బండి సంజయ్: జితేందర్ రెడ్డితో ఈటల లంచ్ భేటీ

By narsimha lode  |  First Published Jul 3, 2023, 2:32 PM IST


మాజీ ఎంపీ  జితేందర్ రెడ్డితో  మాజీ మంత్రి ఈటల రాజేందర్  ఇవాళ సమావేశమయ్యారు. జితేందర్ రెడ్డి  ఫామ్ హౌస్ లో  లంచ్ భేటీ సమావేశం  జరిగింది.


హైదరాబాద్: మాజీ ఎంపీ  జితేందర్ రెడ్డితో  మాజీ మంత్రి ఈటల రాజేందర్  సోమవారంనాడు భేటీ అయ్యారు.  జితేందర్ రెడ్డి    ఫామ్ హౌస్ లో  ఈటల రాజేందర్ భేటీ అయ్యారు.  హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి  ఈటల రాజేందర్  ఇవాళ  జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్ కు  చేరుకున్నారు.     ఇటీవల కాలంలో జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్ మధ్య    కోల్డ్ వార్  నెలకొంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్  కు    పార్టీలో కీలక పదవిని  ఇస్తారని  ప్రచారం సాగుతుంది.  మరో వైపు బీజేపీ అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ ను తప్పిస్తారనే  ప్రచారం కూడ ఉంది.  ఈ సమమయంలో  ఈ ఇద్దరు నేతల  భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

 బండి సంజయ్ కు  మాజీ  ఎంపీ  జితేందర్ రెడ్డి మద్దతుగా  నిలిచారు.  గత మాసంలో  జితేందర్ రెడ్డి నివాసంలో  పలువురు  బీజేపీ నేతలు  సమావేశమయ్యారు.  పార్టీలో  చోటు  చేసుకున్న పరిణామాలపై  చర్చించారు.  బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవిని తప్పిస్తారనే ప్రచారంతో పాటు  ఈటల రాజేందర్ కు  పార్టీలో కీలక పదవి విషయమై  చర్చించారని  సమాచారం.  

Latest Videos

 పార్టీలో చోటు  చేసుకున్న పరిణామాల నేపథ్యంలో  ఓ జంతువును కాలితో  తన్నుతూ  ట్రాలీలో ఎక్కించే   వీడియోను జితేందర్ రెడ్డి  ట్విట్టర్ వేదికగా   పోస్టు చేశారు. బీజేపీ తెలంగాణ నేతలకు  ఈ రకమైన ట్రీట్ మెంట్  అవసరమని ఈ వీడియోతో పాటు  పోస్టు  చేశారు.  ఆ తర్వాత  ఈ పోస్టుపై  జితేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు.  బండి సంజయ్ ను   బీజేపీ అధ్యక్ష పదవి నుండి  తప్పించాలని  కోరుతున్న నేతలనుద్దేశించి  ఈ ట్వీట్  చేశానని జితేందర్ రెడ్డి  వివరణ  ఇచ్చారు.  ఈ వ్యాఖ్యలపై  మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడ  స్పందించారు.  సీనియర్లు, అనుభవం ఉన్న నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని ఆయన  సూచించారు.  ఇతరుల స్వేచ్ఛను, గౌరవానికి  భంగం కలిగేలా మాట్లాడకూడదని  ఈటల రాజేందర్  జితేందర్ రెడ్డికి సూచించారు. 

ఇదిలా ఉంటే  ఈ నెల  8వ తేదీన  వరంగల్ లో  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను  బీజేపీ ఏర్పాటు  చేసింది. బహిరంగ సభ  ఏర్పాటు సభాస్థలిని నిన్న  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా  పలువురు  బీజేపీ నేతలు  పరిశీలించారు.  నిన్న వరంగల్ లో  జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్ కలిశారు.  ఇవాళ  ఈటల రాజేందర్ ను  జితేందర్ రెడ్డి  భోజనానికి  ఆహ్వానించారు. జితేందర్ రెడ్డి ఆహ్వానం మేరకు  ఇవాళ  జితేందర్ రెడ్డితో  ఈటల రాజేందర్ జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్ కు వచ్చారు.  ఇటీవల  పార్టీలో  చోటు  చేసుకున్న పరిణామాలపై  వీరిద్దరి మధ్య  చర్చ జరిగిందని ప్రచారం సాగుతుంది. 

మరో వైపు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను  పార్టీ అధిష్టానం  ఢిల్లీకి రావాలిని పిలిచింది. దీంతో  బండి సంజయ్  ఇవాళ న్యూఢిల్లీకి వెళ్లారు. ఈ  తరుణంలో జితేందర్ రెడ్డితో  ఈటల రాజేందర్ సమావేశం చర్చకు  కారణమైంది.
 

click me!