టీఎస్ఆర్టీసీ బిల్లు: ఆమోదం తెలిపిన తమిళిసై , సర్కార్‌కు పది సిఫారసులు

By narsimha lode  |  First Published Aug 6, 2023, 1:33 PM IST

తెలంగాణ ఆర్టీసీ బిల్లుకు  గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు.


హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్   ఆదివారంనాడు ఆమోదం తెలిపారు.ఇవాళ మధ్యాహ్నం ఆర్టీసీ, రవాణాశాఖ ఉన్నతాధికారులతో  గవర్నర్ తమిళసై సౌందరరాజన్  సమావేశమయ్యారు. రవాణాశాఖకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు సహా ఆర్టీసీకి చెందిన  ఉన్నతాధికారులు  ఈ సమావేశంలో పాల్గొన్నారు.  ఆర్టీసీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల విషయమై  గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన సందేహలను అడిగారు.  గవర్నర్ లేవనెత్తిన  అంశాలపై  అధికారులు సమాధానం చెప్పారు.

ఈ సమాధానాలపై సంతృప్తి చెందిన గవర్నర్ ఆర్టీసీ  ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపారు. శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టేందుకు  గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  సిఫారసు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు గవర్నర్.బిల్లుతో పాటు 10 అంశాలను  గవర్నర్ సిఫారసు చేశారు.న్యాయపరమైన అంశాలతో పాటు ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి  గవర్నర్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు.

Latest Videos

ఆస్తులను ఆర్టీసీ అవసరాలకే వినియోగించాలి, ఈ మేరకు  ప్రభుత్వం నుండి స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని  గవర్నర్ కోరారు. ఆర్టీసీ  కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను క్లియర్ చేయాలని  కోరారు.   ఆర్టీసీ బస్సుల నిర్వహణ, మెయింటెనెన్స్ ను  ప్రభుత్వమే తీసుకోవాలని గవర్నర్ సూచించారు.ఆర్టీసీ ఆస్తులు, భూములు కార్పోరేషన్ తో ఉండాలని  కోరారు.ఈ మేరకు ప్రభుత్వం నుండి స్పష్టత ఇవ్వాలన్నారు. ఆర్టీసీ కార్మికులను కూడ ప్రభుత్వ ఉద్యోగులుగా చూడాలని కోరారు.ఆర్టీసీ కార్మికుల గ్రేడ్, జీతం, ప్రమోషన్లు, ప్రయోజనాలను పరిరక్షించాలని  గవర్నర్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఆర్టీసీ ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలను కల్పించాలని కోరారు. దీంతో ఈ బిల్లును  రాష్ట్ర ప్రభుత్వం  ఇవాళ  అసెంబ్లీలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

ఆర్టీసీ ఉద్యోగులు,  కార్మికులను  ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు  తెలంగాణ కేబినెట్ ఈ ఏడాది జూలై  31న  తీర్మానం చేసింది.ఈ తీర్మానానికి అనుగుణంగా   బిల్లును తయారు  చేసి  గవర్నర్ కు పంపింది.   అయితే  ఈ విషయమై గవర్నర్  తనకు ఉన్న సందేహలపై   ప్రభుత్వాన్ని వివరణ కోరారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.  నిన్న మధ్యాహ్నం ఐదు  అంశాలపై  , నిన్న సాయంత్రం  మరో మూడు అంశాలపై  ప్రభుత్వం నుండి స్పష్టత కావాలని  గవర్నర్ కోరారు.ఈ విషయమై ప్రభుత్వం నుండి  గవర్నర్ కు  అధికారులు వివరణను  పంపారు.

ఇవాళ  ఉదయం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  పుదుచ్ఛేరి నుండి  హైద్రాబాద్ కు తిరిగి వచ్చారు.  ఇవాళ మధ్యాహ్నం  ట్రాన్స్ పోర్టు సెక్రటరీ, రవాణా శాఖాధికారులను   రాజ్ భవన్ కు రావాలని గవర్నర్  ఆదేశించారు.  గవర్నర్ ఆదేశాల మేరకు  అధికారులు ఇవాళ  గవర్నర్ తో భేటీ అయ్యారు.ఈ భేటీలో  గవర్నర్ సందేహలకు  అధికారులు ఇచ్చిన సమాధానంతో  ఆమె సంతృప్తి చెందారు. అసెంబ్లీలో బిల్లు పెట్టేందుకు అనుమతిని ఇచ్చారు.  

also read:టీఎస్ఆర్టీసీ బిల్లుకు నేను వ్యతిరేకం కాదు: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

ఈ బిల్లుకు  ఆమోదం తెలపాలని కోరుతూ నిన్న రాజ్ భవన్ ను  ఆర్టీసీ కార్మికులు  ముట్టడించారు. రాజ్ భవన్ లో  కార్మిక సంఘాల నేతలతో  గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  మాట్లాడారు.  ఆ తర్వాత  తన సందేహల గురించి  ప్రభుత్వం నుండి వివరణ కోరారు. ఆ తర్వాత  బిల్లుకు ఆమోదం తెలిపారు. 

 


 

click me!