ఆర్టీసీ భూములపై కేసీఆర్ కుటుంబం కన్ను: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By narsimha lode  |  First Published Aug 6, 2023, 1:10 PM IST

ఆర్టీసీ భూములపై కేసీఆర్ కుటుంబం కన్ను పడిందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ఆరోపించారు. 


హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులపై  కేసీఆర్ కు ప్రేమ లేదని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.ఆదివారంనాడు హైద్రాబాద్ లో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు.ఆర్టీసీ బిల్లు విషయంలో నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. కార్మికుల మీద ప్రేమ ఉంటే అవసరమైతే  అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని ఆయన  ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే  ప్రత్యేకంగా అసెంబ్లీని ప్రత్యేకంగా ఏర్పాటు  చేయాలని ఆయన కోరారు. ఆర్టీసీ కార్మికుల మీద ప్రభుత్వానికి ప్రేమ లేదని యన విమర్శించారు. వేలాది ఎకరాల ఆర్టీసీ భూములపై కేసీఆర్ కుటుంబం కన్నేసిందని ఆయన  ఆరోపించారు. 

ఏదో రకంగా ఆర్టీసీ భూములను అమ్ముకోవాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు.  ఉన్నట్టుండి ఆర్టీసీ మీద కేసీఆర్ కు ఎందుకు  ప్రేమ పుట్టుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనానికి  బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని  ఆయన  ప్రకటించారు. ఆర్టీసీ బిల్లుపై బీఆర్ఎస్ పూర్తిగా రాజకీయాలు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ప్రకటించారు.ఆర్టీసీ కార్మికుల పక్షాన బీజేపీ ఉందన్నారు.

Latest Videos

also read:టీఎస్ఆర్టీసీ బిల్లుకు నేను వ్యతిరేకం కాదు: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను, ఉద్యోగులను  ప్రభుత్వంలో విలీనం చేస్తూ  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు  ఈ ఏడాది జూలై  31న తెలంగాణ కేబినెట్ సమావేశం తీర్మానం చేసింది.ఈ తీర్మానానికి అనుగుణంగా  ప్రభుత్వం బిల్లును  గవర్నర్ కు  పంపింది. అయితే ఈ బిల్లుపై  గవర్నర్ తనకున్న సందేహలను  ప్రభుత్వాన్ని అడిగారు. నిన్న రెండు దఫాలుగా  ప్రభుత్వాన్ని సందేహలు అడిగారు గవర్నర్. ఇవాళ మధ్యాహ్నం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో  రవాణాశాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు.  ఆర్టీసీ బిల్లులోని సందేహలపై గవర్నర్ చర్చించారు.  తన సందేహలపై ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలతో  గవర్నర్ సంతృప్తి చెందితే ఆమోదించనున్నారు. గవర్నర్ ఈ బిల్లును ఆమోదిస్తే  ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో  ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టనుంది.  ఈ బిల్లును గవర్నర్ ఏ రకంగా  స్పందిస్తారో  చూడాలి

click me!