గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై తమిళిసై నిర్ణయం: ఆశావాహులకు నిరాశ

By narsimha lodeFirst Published Jan 18, 2024, 2:22 PM IST
Highlights

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో  తమిళిసై సౌందర రాజన్ తీసుకున్న నిర్ణయం ఆశావాహులకు ఇబ్బంది కలిగిస్తుంది.


హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ  నియామకం విషయంలో హైకోర్టు నిర్ణయం తర్వాతే  ప్రభుత్వం నుండి  సిఫారసులు తీసుకుంటామని  తెలంగాణ గవర్నర్  తమిళిసై సౌందర రాజన్ నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీలోని ఆశావాహులకు నిరాశను మిగిల్చింది.

తెలంగాణలో  భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న సమయంలో  2023 జూలై 31న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటా  కింద ఎమ్మెల్సీలుగా  సిఫారసు చేసింది  కేబినెట్. అయితే  2023 సెప్టెంబర్ 25న  ఈ ఇద్దరి పేర్లను  తిరస్కరిస్తూ  గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్  171(5) మేరకు ప్రభుత్వ సిఫారసులున్నాయని  తమిళిసై సౌందరరాజన్ అప్పట్లోనే  స్పష్టం చేసింది. అయితే  గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. అయితే  ఈ పిటిషన్ పై  ఈ నెల  5వ తేదీన  విచారణ జరిగింది.ఈ నెల  24 న కూడ మరోసారి విచారణ జరగనుంది.ఈ పిటిషన్ పై  హైకోర్టు తీర్పు తర్వాతే  గవర్నర్ కోటాలో  ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో ప్రభుత్వం నుండి సిఫారసులను తీసుకుంటామని గవర్నర్ ఈ నెల  17న  ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.  కాంగ్రెస్ పార్టీలో నామినేటేడ్ పదవుల కోసం  ఆ పార్టీ నేతలు  ఆ పార్టీ నాయకత్వంపై  ఒత్తిడి తెస్తున్నారు. ఎమ్మెల్యే టిక్కెట్లను త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీ టిక్కెట్ల  విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది. 

also read:అద్దంకి ఔట్: బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్‌‌లకు ఎమ్మెల్సీ టిక్కెట్లిచ్చిన కాంగ్రెస్

గవర్నర్ కోటా  ఎమ్మెల్సీ కింద  తెలంగాణ జన సమితి  చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు  జాఫర్ జావీద్, అలీ మస్కతి , షబ్బీర్ అలీ తదితరుల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ కు  తెలంగాణ జన సమితి  మద్దతు ప్రకటించింది. దీంతో  కోదండరామ్ కు  ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుంది.  మరో వైపు కోదండరామ్ కు మంత్రి పదవి కూడ కట్టబెట్టే అవకాశం ఉందనే  ప్రచారం కూడ లేకపోలేదు.

also read:జీహెచ్ఎంసీపై ఫోకస్: కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

 అయితే గవర్నర్ నిర్ణయం కారణంగా కాంగ్రెస్ లోని ఆశావాహులు నిరాశ చెందుతున్నారు. రాష్ట్రంలోని  54 కార్పోరేషన్లకు చైర్మెన్లను కూడ కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ విషయమై పార్టీ నాయకత్వంతో  రేవంత్ రెడ్డి చర్చించారు. థావోస్ పర్యటనకు వెళ్లే ముందే  ఈ విషయమై చర్చించారు. థావోస్ పర్యటనను ముగించుకొని హైద్రాబాద్ వచ్చిన తర్వాత  కార్పోరేషన్ చైర్మెన్ ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు.ఈ నెలాఖరుకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని  రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. 

click me!