హైద్రాబాద్ బేగంపేట విమానాశ్రయంలో వైమానిక ప్రదర్శన ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు ఈ ఎయిర్ షో జరగనుంది.
హైదరాబాద్: నగరంలోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శనను గురువారంనాడు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు.పౌర విమానయానశాఖ ఆధ్వర్యంలో వైమానిక ప్రదర్శన నాలుగు రోజుల పాటు సాగుతుంది.ఈ నెల 21వ తేదీ వరకు ఈ వైమానిక ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ వైమానిక ప్రదర్శనలో 106 దేశాల నుండి 1500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. భారీ విమానాలు, చార్టెడ్ ఫ్లైట్లు, చాపర్లు, హెలికాప్టర్లను ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి.
ఈ ప్రదర్శనకు ఈ నెల 20, 21 తేదీల్లో సాధారణ సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు.
Live: Inauguration of by Shri https://t.co/ifyvV83Vq5
— Office Of JM Scindia (@Officejmscindia)
undefined
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రసంగించారు.దేశంలో విమాన ప్రయాణీకుల సంఖ్య భారీగా పెరుగుతుందన్నారు.గత రెండేళ్లలో విమాన ప్రయాణీకుల సంఖ్య 250 మిలియన్లు పెరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.దేశంలో మరిన్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు నిర్మించాల్సి ఉందన్నారు.ఉడాన్ పథకం కింద జమ్మూ కాశ్మీర్ లో హెలికాప్టర్ ప్రయాణం అమలు చేస్తున్నట్టుగా తెలిపారు.కాశ్మీర్ లో టూరిజం అభివృద్దికి హెలికాప్టర్ సేవలు మరింత దోహదం చేస్తాయని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.
హైద్రాబాద్ లో వింగ్స్ ఇండియా ప్రదర్శన హర్షణీయమని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఏవియేషన్ రంగంలో ఎన్నో అవకాశాలున్నాయన్నారు.రాష్ట్రంలో సులభతర వాణిజ్య విధానం ఉందని చెప్పారు.ఏరోస్పేస్ పెట్టుబడులకు హైద్రాబాద్ ఎంతో అనుకూలంగా ఉందని మంత్రి తెలిపారు. డ్రోన్ పైలెట్లకు ఎక్కువగా శిక్షణ ఇస్తున్నామని ఆయన వివరించారు.వ్యవసాయం, అత్యవసరాలు, శాంతిభద్రతల్లో డ్రోన్లు వినియోగిస్తున్నామని మంత్రి చెప్పారు.
**