విధుల్లో చేరకపోతే తొలగిస్తాం..: జూనియర్ పంచాయితీ సెక్రటరీల‌ సమ్మెపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం..

Published : May 08, 2023, 04:56 PM ISTUpdated : May 08, 2023, 05:16 PM IST
విధుల్లో చేరకపోతే తొలగిస్తాం..: జూనియర్ పంచాయితీ సెక్రటరీల‌ సమ్మెపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం..

సారాంశం

రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌‌తో సమ్మెకు దిగిన జూనియర్ పంచాయతీ సెక్రటరీ (జేపీఎస్‌‌)లపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది.

హైదరాబాద్‌: రెగ్యులరైజ్‌ చేయాలనే డిమాండ్‌‌తో సమ్మెకు దిగిన జూనియర్ పంచాయతీ సెక్రటరీ (జేపీఎస్‌‌)లపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. రేపు సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటిలోగా విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయితీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా నోటీసులు జారీ చేశారు. 

ఇక, తెలంగాణలోని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్‌), ఔట్‌ సోర్సింగ్‌ పంచాయతీ కార్యదర్శులు (ఓపీఎస్‌) గత నెల 28 నుంచి సమ్మె బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం జేపీఎస్ ప్రొబెషనరీ గడువు పూర్తయిందని.. అయితే  ప్రభుత్వం రెగ్యులరైజేషన్‌ గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వారు చెబుతున్నారు. తమను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ పంచాయతీ సెక్రటరీలను జేపీఎస్‌లుగా ప్రమోట్‌ చేయాలని కోరుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?