కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ సోమవారంనాడు హైద్రాబాద్ కు చేరుకున్నారు. సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ ను ప్రియాంక గాంధీ ప్రకటించనున్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ సోమవారంనాడు ప్రత్యేక విమానంలో హైద్రాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరకున్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ సభలో పాల్గొనేందుకు ప్రియాంక గాంధీ ఇవాళ హైద్రాబాద్ కు వచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకొని ప్రియాంక గాంధీ హైద్రాబాద్ కు వచ్చారు. బేగంటపేట ఎయిర్ పోర్టులో ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆమెకు స్వాగతం పలికారు. బేగంటపేట ఎయిర్ పోర్టు నుండి హెలికాప్టర్ లో ప్రియాంక గాంధీ సరూర్ నగర్ స్టేడియానికి చేరుకుంటారు.
also read:ప్రియాంక సభపై ఫోకస్: యూత్ డిక్లరేషన్ ప్రకటించినున్న కాంగ్రెస్
undefined
మరో వైపు ఎల్‌బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి విగ్రహం వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. శ్రీకాంతాచారి విగ్రహం నుండి రేవంత్ రెడ్డి సరూర్ నగర్ స్టేడియం వరకు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ర్యాలీగా చేరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏం చేయనుందొ ఈ స
భలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. యూత్ డిక్లరేషన్ ను ప్రకటిస్తారు. నిరుద్యోగుల్లో భరోసా కల్పించే విధంగా యూత్ డిక్లరేషన్ ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
గతంలో వరంగల్ లో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.ఈ సభలో రైతు డిక్లరేషన్ ను కాంగ్రెస్ ప్రకటించింది. ఇవాళ యూత్ డిక్లరేషన్ ను కాంగ్రెస్ ప్రకటించనుంది. త్వరలోనే బీసీ డిక్లరేషన్ ను కూడా కాంగ్రెస్ ప్రకటించనుంది. బీసీలతో భారీ సభను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ సభలో బీసీ డిక్లరేషన్ ను కాంగ్రెస్ ప్రకటించనుంది. ఇదిలా ఉంటే హత్ సే హాత్ సే జోడో అభియాన్ లో భాగంగా పాదయాత్ర నిర్వహిస్తున్న మల్లు భట్టి విక్రమార్క కూడా పాదయాత్రగా సరూర్ నగర్ స్టేడియానికి చేరుకుంటారు. సరూర్ నగర్ స్టేడియంలో ప్రజా యుద్దనౌక గద్దర్ తన ఆటపాటలతో అలరించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వినతి మేరకు గద్దర్ ఈ సభలో ఆడి పాడారు.