తెలంగాణలో సెప్టెంబర్ 1 నుండి స్కూల్స్ రీ ఓపెన్: నేడు ప్రభుత్వ ఉత్తర్వులిచ్చే ఛాన్స్?

By narsimha lodeFirst Published Aug 13, 2021, 2:19 PM IST
Highlights

 సెప్టెంబర్ 1 నుండి తెలంగాణలో విద్యార్థులకు ప్రత్యక్ష క్లాసుల నిర్వహణకు విద్యాశాఖ సిద్దంగా ఉన్నట్టుగా తెలిపింది. 8వతరగతి నుండి పీజీ వరకు ప్రత్యక్ష క్లాసులు నిర్వహిస్తామని ప్రకటించింది. సీఎంఓకి విద్యాశాఖ స్టేటస్ రిపోర్టును పంపింది.


హైదరాబాద్: ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుండి విద్యార్థులకు ప్రత్యక్షంగా క్లాసులు నిర్వహణకు సన్నద్దంగా ఉన్నట్టుగా విద్యాశాఖ తెలిపింది.ఈ మేరకు స్టేటస్ రిపోర్టును తెలంగాణ సీఎం కేసీఆర్ కి విద్యాశాఖ స్టేటస్ రిపోర్టును పంపింది.

also read:తెలంగాణలో విద్యాసంస్థల రీఓపెన్: సీఎంఓకి స్టేటస్ రిపోర్టు, నేడే కీలక నిర్ణయం

2019 మార్చి నుండి తెలంగాణలో విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో నెల రోజుల పాటు విద్యా సంస్థలు తెరిచారు. నెల రోజుల విద్యా సంస్థలు తెరిచిన తర్వాత కరోనా కేసులు పెరిగిపోతున్నాయని విద్యా సంస్థలను  తాత్కాలికంగా మూసివేస్తున్నట్టుగా ప్రకటించింది ప్రభుత్వం.

ఈ విద్యా సంవత్సరంలో ఆన్‌లైన్ లోనే క్లాసులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో విద్యా సంస్థల రీ ఓపెనింగ్  చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయమై స్టేటస్ రిపోర్టును  విద్యాశాఖ  సీఎంఓకి పంపింది.

కరోనాతో విద్యార్థులకు ఇబ్బంది  ఉండదని విద్యాశాఖ సీఎంఓకి నివేదికను పంపింది. 8వతరగతి నుండి పీజీ వరకు ప్రత్యక్ష క్లాసులు నిర్వహించేందుకు విద్యాశాఖ మొగ్గుచూపింది. సెప్టెంబర్ 1వ తేదీ నుండి ప్రత్యక్ష తరగతులకు సిద్దంగా ఉన్నట్టుగా విద్యాశాఖ స్టేటస్ రిపోర్టులో పేర్కొంది.ఈ విషయమై ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

click me!