తెలంగాణలో విద్యాసంస్థల రీఓపెన్: సీఎంఓకి స్టేటస్ రిపోర్టు, నేడే కీలక నిర్ణయం

By narsimha lodeFirst Published Aug 13, 2021, 1:18 PM IST
Highlights

తెలంగాణలో విద్యా సంస్థల రీ ఓపెనింగ్ కు వైద్యశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించే విషయమై స్టేటస్ రిపోర్టును సీఎంఓకు పంపింది విద్యాశాఖ. ఈ విషయమై సీఎం ఇవాళ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని  పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడ సూచించింది.


హైదరాబాద్:  తెలంగాణలో విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించే విషయమై స్టేటస్ రిపోర్టును  విద్యాశాఖ సీఎంఓకు శుక్రవారం నాడు పంపింది.విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని కూడ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచించింది.  తెలంగాణలో విద్యా సంస్థలు తిరిగి తెరిచేందుకు వైద్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీంతో విద్యాశాఖ అధికారులు స్టేటస్ రిపోర్టును సీఎంఓకు పంపారు. 

also read:తెలంగాణలో విద్యా సంస్థల రీఓపెనింగ్‌కి వైద్యశాఖ గ్రీన్‌సిగ్నల్: సూచనలివీ..

ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కూడ విద్యా సంస్థలను తిరిగి  ప్రారంభించే విషయమై చర్చించారు. ఏపీ రాష్ట్రంలో ఈ నెల 16 నుండి  విద్యా సంస్థలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకొన్నారు. 

దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఈ మాసంలోనే విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ తరుణంలోనే తెలంగాణలో కూడ విద్యా సంస్థలను ఓపెన్ చేయాలన డిమాండ్ నెలకొంది.సెప్టెంబర్ 1వ తేదీ నుండి విద్యా సంస్థలను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు కోరుతున్నాయి.

వాస్తవానికి ఈ ఏడాది జూలై 1వ తేదీ నుండి  విద్యాసంస్థలను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం తొలుత నిర్ణయం తీసుకొంది. అయితే కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకొంది. ఆన్‌లైన్ క్లాసులకే పరిమితమైంది.

ఏ క్లాసుల నుండి ఏ క్లాసుల విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులను అనుమతించాలి, ఎవరికి ఆన్ లైన్ క్లాసులను కొనసాగించాలనే దానిపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

click me!