పోలీసు అనుమతి నిరాకరణ... ఇబ్రహీంపట్నం దళిత గిరిజన దండోరా సభా స్థలం మార్పు

By Arun Kumar PFirst Published Aug 13, 2021, 11:54 AM IST
Highlights

ట్రాఫిక్ ఆంక్షల పేరిట ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్  పార్టీ నిర్వహించ తలపెట్టిన దళిత గిరిజన దండోరా సభాస్థలాన్ని మారుస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు మల్ రెడ్డి రంగారెెడ్డి ప్రకటించారు.

హైదరాబాద్: ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ సక్సెస్ తో రాష్ట్రవ్యాప్తంగా ఈ  దండోరా సభలను నిర్వహించడానికి సిద్దమైంది తెలంగాణ కాంగ్రెస్. ఈ క్రమంలోనే ఈ నెల 18న హైదరాబాద్ శివారులోని   ఇబ్రహీంపట్నంలో దళిత, గిరిజన దండోరా సభ నిర్వహించనున్నట్లు ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ట్రాఫిక్ ఆంక్షలు, పోలీసుల అనుమతి నిరాకరణతో సభాస్థలాన్ని మారుస్తున్నట్లు కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి ప్రకటించారు. 

పోలీసుల సూచన మేరకు ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఈ దండోరా సభ నిర్వహించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. 18వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో  దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా సభ నిర్వహించి తీరతామని రంగారెడ్డి స్పష్టం చేశారు. 

read more కాంగ్రెస్ జెండా మోసేవారికే న్యాయం, కార్యకర్తల పార్టీ: ఇంద్రవెల్లిలో రేవంత్

ఇంద్రవెల్లి సభ విజయవంతమైన నేపథ్యంలో కాంగ్రెస్ లో మరింత జోష్ పెరిగింది... కాబట్టి ఇబ్రహీంపట్నం సభకు ఖచ్చితంగా సీనియర్లందరూ హాజరవుతారన్న ధీమాతో వుంది రేవంత్ వర్గం. వరుసగా నిర్వహిస్తున్న దండోరా సభలు సక్సెస్ అయితే అదిష్టానం దగ్గర రేవంత్ కు మరింత గుర్తింపు వస్తుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేవలం రేవంత్ ఒక్కడికే ఈ క్రెడిట్ దక్కకూడదన్న ఉద్దేశ్యంతో అయినా నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్లు ఇబ్రహీంపట్నం సభలో పాల్గొనాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇంద్రవెల్లి దండోరా సభకు హాజరుకాలేని సీనియర్లు ఇబ్రహీంపట్నం సభకు హాజరయ్యే అవకాశాలున్నాయట. కాంగ్రెస్ నాయకులంతా ఒకే తాటిపైకి వచ్చి ఈ సభను విజయవంతం చేసి అధికార టీఆర్ఎస్, బిజెపిలకు గట్టి హెచ్చరిక పంపాలని చూస్తున్నారు. 

click me!