గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లో మార్పులు: ఇంటర్వ్యూలు ఎత్తివేత‌కు కేసీఆర్ సర్కార్ ప్లాన్

Published : Apr 06, 2022, 03:10 PM IST
గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లో మార్పులు: ఇంటర్వ్యూలు ఎత్తివేత‌కు కేసీఆర్  సర్కార్ ప్లాన్

సారాంశం

గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లో ఇంటర్వ్యూలను ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది.ఈ మేరకు జీఏడీ  ఫైలును సిద్దం చేసింది. సీఎం కేసీఆర్ ఆమోదం పొందితే ఇంటర్వ్యూలను ఎత్తివేయనున్నారు.

హైదరాబాద్: Group-1,Group-2  పోటీ పరీక్షల్లో మార్పులు చేర్పులు చేయాలని  కూడా Telangana ప్రభుత్వం భావిస్తుంది.  ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సాధారణ పరిపాలన శాఖ ఫైలు సిద్దం చేసింది. సీఎం KCR ఆమోదం కోసం ఈ ఫైల్ ను పంపారు. సీఎం ఆమోదం పొందితే  గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లో Interviews ఎత్తివేయనున్నారు.

 గ్రూప్- 1  పరీక్షల్లో ఇంటర్వ్యూలో వంద మార్కులు,గ్రూప్ -2 లో ఇంటర్వ్యూకి 75 మార్కులు ఇస్తారు. ఇంటర్వ్యూలతో  మార్కులు కేటాయించడంతో అవినీతికి చోట దక్కే అవకాశం ఉందనే ప్రచారం కూడా లేకపోలేదు. దీంతో ఇంటర్వ్యూలను ఎత్తివేయాలని భావిస్తున్నారు. 
TSPSC ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూలున్నాయి. అయితే ఇంటర్వ్యూలను ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తుంది. 

రాష్ట్రంలో సుమారు 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని తతెలంగాణ  ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2 ;పోస్టులు కూడా ఉన్నాయి. గ్రూప్-1  ద్వారా  503 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం తలపెట్టింది.ఈ పోస్టుల భర్తీకి తెలంగాణ ఆర్ధిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో వైపు గ్రూప్ 2కి ఇంకా అనుమతి రాలేదు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే