
Cricket betting: తెలంగాణలో గత కొంత కాలంగా ఆన్‌లైన్ బెట్టింగులు పెరుగుతున్నాయి. ఇక ఇండియన్ ప్రీమీయర్ లీగ్- టీ20 క్రికెట్ ప్రారంభమైన తర్వాత ఇవి మరింగా క్రికెట్ బెట్టింగులు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే క్రికెట్ బెట్టింగ్ (cricket betting) నిర్వహిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ సిటీ పోలీసులు రట్టు చేశారు. రాజధానిలో ఆన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న పలువురిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పలు వస్తువులు, భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఆన్‌లైన్‌లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్న మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నగరంలో ఓ ముఠా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతోంది. ప్రత్యేన నిఘా పెట్టిన పోలీసు బృందం.. బెట్టింగ్ ముఠా వ్యవహారాలను రట్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్ ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న.. ముగ్గురు నిర్వాహకులు, ఒక అకౌంటెంట్ సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం బెట్టింగ్ నిర్వహిస్తున్న ఈ ఏడు మందిపై కేసు నమోదుచేశారు.
ఆన్‌లైన్‌లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్న ఈ ముఠా నుంచి పోలీసులు రూ.43 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే, వారివద్ద నుంచి ఒక ల్యాప్ టాప్, ఒక మారుతీ కారు, రెండు మోటార్ సైకిళ్లు, 9 సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం వస్తువుల విలువ రూ 56,00,000/- ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఐపీఎల్ క్రికెట్ ఆన్‌లైన్ బెట్టింగ్ పై కేసు నమోదుచేసుకున్నామనీ, దీనిపై విచారణ జరుగుతున్నదని తెలిపారు.
ఆన్‌లైన్‌లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్న ముఠా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారని తెలిపారు. ఈ బెట్టింగ్ ముఠాలో ప్రధాన సూత్రధారి సాయిరామ్ వర్మ అని తెలిపారు. పుదుచ్చేరి, యానం ప్రాంతాల్లోనూ బెట్టింగ్ మూఠా కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. మరో ముఖ్య సూత్రధారి నాగరాజు.. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందినవారని తెలిపారు. అయితే, ఇతను హైదరాబాద్ లోని వనస్థలిపురంలోని ఓ అపార్టుమెంట్ లో నివాసముంటున్నాడు. మరో నిందితుడు సింగరాయ్ కొండకు చెందిన వాడని తెలిపారు. ఎల్బీ నగర్ ఎస్ఓటీ టీం పక్కా సమాచారంతో నిఘా పెట్టి వారిని అరెస్టు చేసింది.