కానిస్టేబుల్‌ పట్ల దురుసు ప్రవర్తన: భోలక్‌పూర్ కార్పోరేటర్ గౌసుద్దీన్ అరెస్ట్

Published : Apr 06, 2022, 02:35 PM IST
కానిస్టేబుల్‌ పట్ల దురుసు ప్రవర్తన: భోలక్‌పూర్  కార్పోరేటర్ గౌసుద్దీన్ అరెస్ట్

సారాంశం

పోలీసు కానిస్టేబుల్ పై దురుసుగా వ్యవహరించిన భోలక్‌పూర్ కార్పోరేటర్ గౌసుద్దీన్ ను పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్ పై దురుసుగా వ్యవహరించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు.

హైదరాబాద్: ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని భోలక్‌పూర్ కార్పోరేటర్  గౌసుద్దీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  
భోలక్ పూర్ లో  సోమవారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో దుకాణాలు మూసి వేయాలని పోలీసులు కోరారు. 

భోలకపుర్ కార్పొరేటర్ గౌస్ ఉద్దీన్ సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పట్ల దురుసుగా వ్యవహరించిన విషయం విధితమే. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై  సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. దీంతో భోలక్ పూర్  కార్పోరేటర్ ను అరెస్ట్ చేయాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్  డీజీపీని ఆదేశించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కోరారు. 

మంత్రి ఆదేశం మేరకు పోలీసులు కార్పొరేటర్ గౌసుద్దీన్‌ను బుధవారంనాడు అరెస్ట్ చేశారు. అతనిపై 350, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చినట్టుగా చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్  తెలిపారు..
 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్