ప్రతి 5 కిలోమీటర్లకు ఓ చార్జింగ్ స్టేషన్.. EV ల‌ను ప్రోత్సాహానికి Telangana government ప్రణాళికలు

Published : Dec 30, 2021, 02:57 PM IST
ప్రతి 5 కిలోమీటర్లకు ఓ చార్జింగ్ స్టేషన్.. EV ల‌ను ప్రోత్సాహానికి  Telangana government ప్రణాళికలు

సారాంశం

 పెట్రోల్‌ బంకుల తరహాలోనే ఎలక్ట్రిక్‌ వెహికల్‌ యూజర్లకు ఛార్జింగ్‌ సౌకర్యం అందించే Telangana government ప్రణాళిక‌లు రూపొందిస్తోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కూ తెలంగాణ‌లో 138 చార్జింగ్ స్టేషన్లు ఉండగా, అదనంగా మ‌రో 600 చార్జీంగ్ స్టేష‌న్లు ను ఏర్పాటు చేయ‌లని భావిస్తోంది. వీటిని ప్ర‌వేట్ నిర్మాణంలో ప్ర‌వేట్ భాగ‌స్వాములను తీసుకోవాలని యోచిస్తోంది.  

Telangana government EV:   ప్ర‌స్తుతం దేశంలో ఎల‌క్ట్రానిక్ వెహిక‌ల్స్ ట్రెండ్ న‌డుస్తోంది. క్రమంగా పెట్రోలు, డీజిల్ వాహ‌నాల నుంచి  ఎలక్ట్రిక్ వాహ‌నాల వైపు ప్రజలు మళ్లుతున్నారు. అయితే ఈ చేంజింగ్‌ ట్రెండ్‌కి ఛార్జింగ్‌ పాయింట్ల షార్టేజీ పెద్ద సమస్యగా మారింది. ఈ స‌మ‌స్య‌ను అధిగమించేందుకు ఇటు కేంద్ర ప్ర‌భుత్వం, అటు రాష్ట్ర ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా మోదీ సర్కార్ చ‌ర్య‌లు చేప‌డుతోంది.  వచ్చే పదేళ్లలో నాలుగోవంతు వాహనాలు విద్యుత్ వాహనాలే ఉండాలన్నదని కేంద్రం వ్యూహం. ఇందుకోసం ప్రస్తుతానికి ప్రభుత్వ రంగ రవాణా సంస్థల్లో విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్రం.. వ్యక్తిగత విద్యుత్ వాహనాల కొనుగోలకు ఆఫర్లు అందిస్తున్నది

ఇటు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఎల‌క్ట్రిక్  వాహ‌నాల‌ను ప్రోత్స‌హించ‌డానికి ముందు వ‌స్తోంది. పర్యావరణానికి అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్య‌త పెరిగేలా ముంద‌స్తు చ‌ర్య‌లు చేపట్టింది.ఈ వాహ‌నాల ప్ర‌ధాన స‌మ‌స్య  చార్జీంగ్ సేష‌న్లు.. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించాలంటే .. చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉంచ‌డానికి ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తుంది. ఈ క్ర‌మంలో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రైవేటు సంస్థలను అనుమతించాల‌నే ఆలోచనతో ఉంది. బీవోటీ విధానంలో (నిర్మించు, నిర్వహించు, బదిలీ చేయి) రాష్ట్ర వ్యాప్తంగా చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రైవేటు సంస్థలను అనుమతించాల‌నే ఆలోచ‌న‌లో ఉంది  ప్రభుత్వం. 

Read Also: Omicron: ఏడాది కింద చూసిన డిసీజ్ కాదు.. ఇది.. : ఆక్స్‌ఫర్డ్ సైంటిస్ట్
 
ఈ ప్రాజెక్టు ప్రకారం.. పట్టణాల్లో అయితే ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి, జాతీయ రహదారులపై ప్రతి 27 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్ ఉండేలా ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తుంది.  ఈ మేర‌కు ప్ర‌భుత్వ మార్గదర్శకాలు తయారవుతున్నాయి. ఇందుకు సంబంధించి తెలంగాణ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఈఆర్డీసీవో) త్వరలోనే టెండర్లకు ఆహ్వానం పలుకుతుంద‌ని సంస్థ వైస్ చైర్మన్ ఎన్.జానయ్య తెలిపారు. TSREDCO మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ జానయ్య మీడియాతో మాట్లాడుతూ.. కొత్త EV ఛార్జింగ్ స్టేషన్‌లను ప్రారంభించే సమయానికి ఇంటిగ్రేటెడ్ యాప్ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. “హైదరాబాద్‌లోని 118 సహా రాష్ట్రంలో మొత్తం 138 EV ఛార్జింగ్ స్టేషన్‌లు ఏర్పాటు జ‌రుగుతోంద‌ని , వాటిని యాప్ తో  ట్యాగ్ చేస్తామని తెలిపారు. ప్ర‌స్తుతం 20 ఛార్జీంగ్ స్టేష‌న్ లు ప్రారంభానికి సిద్దంగా ఉన్న‌యని  చెప్పారు.

Read Also; Uttar Pradesh Assembly elections 2022: షెడ్యూల్ ప్రకారమే యూపీలో ఎన్నికలు... తేల్చేసిన సీఈసీ

ఎల‌క్ట్రానిక్ వెహికిల్స్ గురించి మరింత అవగాహన కల్పించడానికి కార్య‌క్ర‌మాలు రూపొందిస్తోన్నామ‌ని తెలిపారు. ఎలక్ట్రానిక్ వాహ‌నాల‌ను ప్రమోట్ చేయడానికి ఎక్స్‌పోస్, రోడ్ షోలు, స్టేక్‌హోల్డర్‌లు వారి ఉత్తమ పద్ధతులకు అవార్డులతో ప్రోత్సహించడం వంటి అనేక కార్యక్రమాలతో తాము ముందుకు వస్తున్నామని  చెప్పారు.  మార్కెట్‌లోని ద్విచక్ర వాహనాలు, త్రి వీల‌ర్స్ అందుబాటులో ఉన్న ఉత్తమమైన EVల గురించి సాధారణ ప్రజలు తెలుసుకునే,  వాటి పనితీరు గురించి వినియోగదారుల నుండి అభిప్రాయాన్ని చూడగలిగే సమీక్ష విభాగం కూడా యాప్‌లో ఉంటుందని అధికారులు తెలిపారు.

Read Also; న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలపై ఆంక్షలు: తెలంగాణ డీజీపీ

అలాగే..  EV ఛార్జింగ్ స్టేషన్‌ల ఆదాయం పంచుకునే విధానం కింద ప్రైవేటు భూ యజమానులు, పారిశ్రామికవేత్తలు సంయుక్తంగా ఏర్పాటు చేయవచ్చని జానయ్య చెప్పారు. ఇందుకు ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంద‌ని తెలిపారు. ఈ ఏడాది మార్చి నెలలో 2,465ఈవీల వాహనాలు విక్రయం కాగా, జూన్ లో 3,800కు పెరిగాయని అధికారులు తెలిపారు. గడిచిన ఆరు నెలల్లో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఈవీ దరఖాస్తులు 5,500గా ఉన్నట్టు వెల్లడించారు.  

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?