కేసుల పెరుగుదల థర్డ్ వేవ్ కు సంకేతం.. జాగ్రత్తగా ఉండాల్సిందే.. : డీహెచ్ శ్రీనివాసరావు

By SumaBala Bukka  |  First Published Dec 30, 2021, 1:31 PM IST

omicron వేగంగా వ్యాప్తి చెందుతోందని.. ప్రస్తుతం కేసుల పెరుగుదల థర్డ్ వేవ్ కు సంకేతమన్నారు. డెల్టా వేరియంట్ కంటే 30 రెట్ల వేగంతో ఒమిక్రాన్ వ్యాప్తి ఉందని చెప్పారు. అయితే కేసుల పెరుగుదల మీద ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. 


హైదరాబాద్ : Corona Third Wave ను ఎదుర్కునేదుకు సన్నద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు srinivasa rao తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించిందని.. మన దేశంలోనూ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. telanganaలోనూ గత రెండు మూడు రోజులుగా ఎక్కువయ్యాయన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీహెచ్ మాట్లాడారు. 

omicron వేగంగా వ్యాప్తి చెందుతోందని.. ప్రస్తుతం కేసుల పెరుగుదల థర్డ్ వేవ్ కు సంకేతమన్నారు. డెల్టా వేరియంట్ కంటే 30 రెట్ల వేగంతో ఒమిక్రాన్ వ్యాప్తి ఉందని చెప్పారు. అయితే కేసుల పెరుగుదల మీద ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. 

Latest Videos

undefined

గత రెండు వేవుల్లో నేర్చుకున్న పాఠాలతో ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉందని.. ప్రజలెవరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని.. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఒమిక్రాన్ నుంచి రక్షించుకోవచ్చన్నారు. ఒమిక్రాన్ సోకిన వారిలో 90 శాతం మందికి వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని డీహెచ్ అన్నారు.

లక్షణాలు కనిపించినవారు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని.. సంక్రాంతి తర్వాత థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని డీహెచ్ శ్రీనివాసరావు చెప్పారు. 

317 జీవోపై స్టేకి తెలంగాణ హైకోర్టు నిరాకరణ: నాలుగు వారాలకి విచారణ వాయిదా

కాగా, తెలంగాణలో (Telangana) కరోనా కేసులు భారీగా పెరిగాయి. బుధవారం లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో 38,023 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 235 పాజిటివ్‌ కేసులు (corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 6,81,307కి చేరింది. వైరస్ బారి నుంచి నిన్న 204 మంది కోలుకున్నారు. దీంతో కలిపి తెలంగాణలో మొత్తం రికవరీల సంఖ్య 6,73,793కి చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,490 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  

గడిచిన 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 346 మంది శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ కొవిడ్‌ ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయగా 10 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి మొత్తం 12,267 మంది తెలంగాణకు వచ్చారు.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 2, జీహెచ్ఎంసీ 121, జగిత్యాల 2, జనగామ 2, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 2, కరీంనగర్ 5, ఖమ్మం 2, మహబూబ్‌నగర్ 5, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 2, మంచిర్యాల 2, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 23, ములుగు 2, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 1, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 2, పెద్దపల్లి 1, సిరిసిల్ల 0, రంగారెడ్డి 31, సిద్దిపేట 3, సంగారెడ్డి 6, సూర్యాపేట 5, వికారాబాద్ 1, వనపర్తి 2, వరంగల్ రూరల్ 2, హనుమకొండ 9, యాదాద్రి భువనగిరిలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి

click me!