న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు: తెలంగాణ డీజీపీ

By narsimha lodeFirst Published Dec 30, 2021, 2:48 PM IST
Highlights

కోవిడ్ ఆంక్షలతోనే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు. గురువారం నాడు  మీడియాతో మాట్లాడారు. కోవిడ్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు.

 హైదరాబాద్: కోవిడ్ నిబంధనలతో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని Telangana Dgp Mahender Reddy ప్రజలను కోరారు.  గురువారం నాడు తెలంగాణ డీజపీ మహేందర్ రెడ్డి తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆరోగ్య శాఖ ఇచ్చే సూచనలను విధిగా పాటించాలని ఆయన కోరారు.  విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు ఎయిర్ పోర్టుల్లోనే   Corona టెస్టులు చేపడుతామన్నారు.  మాస్కులు ధరించడంపై పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ  ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకొని ఆంక్షలను అమలు చేస్తున్నామన్నారు.  పోలీస్ శాఖలో  కూడా కరోనా వ్యాక్సిన్ వంద శాతం తీసుకొనేలా చర్యలు తీసుకొన్నామన్నారు. కరోనా వేరియంట్ ఒమిక్రాన్ నియంత్రణలో భాంగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధిస్తున్నట్టుగా డీజీపీ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని డీజీపీ తెలిపారు.

also read:కేసుల పెరుగుదల థర్డ్ వేవ్ కు సంకేతం.. జాగ్రత్తగా ఉండాల్సిందే.. : డీహెచ్ శ్రీనివాసరావు

 తెలంగాణలో పబ్స్‌, హోటళ్లు, క్లబ్‌లకు న్యూఇయర్‌ గైడ్‌ లైన్స్‌ పాటించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో న్యూ ఇయర్‌ ఆంక్షలు అమలు అవుతాయని పేర్కొన్నారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విధంగా ఈ ఆదేశాలను అమలుచేయాలని పోలీసులుకు సూచించారు. న్యూఇయర్‌ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని తెలిపారు.తెలంగాణలో కరోనా ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో ఆంక్షలు విధించాలని హైకోర్టు కూడా సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను విధించింది. ఈ ఆంక్షలను కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ డీజీపీ తెలిపారు. 

click me!