ప్రైవేట్ స్కూల్స్ లో అధిక ఫీజులు: 11 పాఠశాలలపై విచారణకు తెలంగాణ సర్కార్ ఆదేశం

By narsimha lodeFirst Published Oct 8, 2020, 11:54 AM IST
Highlights

జీవో 46కు విరుద్దంగా విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై విచారణ జరపాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకొంది. 
 

హైదరాబాద్: జీవో 46కు విరుద్దంగా విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై విచారణ జరపాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకొంది. 

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి వ్యతిరేకంగా పలు ప్రైవేట్ స్కూల్స్  ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ విషయమై పలువురు విద్యాశాఖఉ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.

పాఠశాల విద్యాశాఖలోని నలుగురు జాయింట్ డైరెక్టర్లను విచారణ అధికారులుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఫిర్యాదులు వచ్చిన స్కూళ్లపై విచారణ చేయనుంది ప్రభుత్వం. ట్యూషన్ ఫీజును నెలవారీగా మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

మౌంట్ లిటేరా, జీ, మెరిడీయన్, గీతాంజలి పబ్లిక్ స్కూల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్, డీడీకాలనీలోని నారాయణ హైస్కూల్,  సికింద్రాబాద్ లోని కల్పస్కూల్, మేడ్చల్ లోని సెయింట్ ఆండ్రూస్ , అమీర్ పేట్ నీరజ్ పబ్లిక్ స్కూల్స్ పై విచారణ జరపనుంది ప్రభుత్వం.

కరోనా సమయంలో నిబంధనలకు విరుద్దంగా ఫీజులు వసూలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా కూడ ప్రైవేట్ స్కూల్స్ అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ విషయమై ప్రభుత్వం విచారణ చేయనుంది.

click me!