
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అర్చకులు,ఆలయ ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 1 నుంచి అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందనున్నాయని వెల్లడించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమాధానమిచ్చారు.
కొత్తగా మరో 3000 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకాన్ని వర్తింపజేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దూపదీప నేవేధ్యం పథకానికి కొత్త మార్గదర్శకాలు ఇచ్చినట్లు తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. సమైక్య పాలనలో ధూప దీప నైవేద్య పథకం కింద గత పాలకులు ఆలయ పూజారులకు నెలకు రూ.2500 ఇస్తే ముఖ్యమంత్రి కేసిఆర్ దాని రూ.6000 కు పెంచారిన తెలిపారు.
ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 1805 ఆలయాలకు (ఖర్చు రూ. 12.99 కోట్లు ) మాత్రమే దూప దీప నైవేద్యం పథకం అమలులో ఉందన్నారు. వీటికి అదనంగా మరో 3 వేల ఆలయాలకు (ఖర్చు రూ.21.60 కోట్లు ) ధూప దీప నైవేద్య పథకాన్ని వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. దీంతో మొత్తం 4805 దేవాలయాలకు ధూప దీప నైవేద్యం పథకం అమలు కానుందని చెప్పారు. ధూప దీప నైవేద్య పథకానికి ఏటా రూ.34.60 కోట్లు వెచ్చించనున్నామన్నారు.
గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఆలయాకు ధూప దీప నైవేద్య పథకాన్ని అమలు చేసే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటామన్నారు. తెలంగాణ దేవాదాయ చట్టం కింద నమోదైన ఆలయాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. వివిధ ఆలయాల్లో అర్చకత్వం చేస్తున్న విశ్వ బ్రాహ్మణులు, జంగమయ్య (జంగం కులస్తులకు)లకు ధూప దీప నైవేద్య పథకం ద్వారా గౌరవ వేతనం ఇచ్చే యోచనలో దేవాదాయ శాఖ ఉందన్నారు.
గతంలో సీజీఎఫ్ కింద ఆలయాలకు నిధులు మంజూరు కాలేదన్నారు. దళిత వాడల్లో ఆలయాల నిర్మాణాని రూ.10 లక్షల వరకు ఎలాంటి కంట్రిబ్యూషన్ లేకుండానే సర్వశ్రేయోనిధి ద్వారా నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. దేవాదాయశాఖ భూముల సమస్యలపై చర్యలు వేగవంతం చేస్తున్నామని వివరించారు. ఆలయ భూముల పరిరక్షణ, అర్చకులు, ఆలయ ఉద్యోగులను ఆదుకోవడం ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.
గుప్త నిధుల పేరిట ఆలయాలను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు కూడా ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
స్వాగత్ హోటల్ లో పురుగల చికెన్
ఔటర్ రింగ్ రోడ్డు మీద యాక్సిడెంట్
https://goo.gl/Tsck2C