అర్థరాత్రి.. కరీంనగర్ పోలీస్.. గోడ దుంకిండు

Published : Nov 10, 2017, 03:07 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
అర్థరాత్రి.. కరీంనగర్ పోలీస్.. గోడ దుంకిండు

సారాంశం

అర్థరాత్రి ఆ పోలీసు చేసిన షాకింగ్ పని కరీంనగర్ లో కలకలం కాంగ్రెస్ నేత కటకం సీరియస్

ఈ కరీంనగర్ పోలీసు మామూలోడు కాదు. గోడ దుంకిండు. అది కూడా అర్థరాత్రి గోడ దుంకిండు. ఆ గోడ కూడా ఎవరిదనుకున్నారు? ఒక విఐపి ఇంటి గోడ. ఇంకేముంది ఆ విఐపి మస్త్ గరమైండు. ఈ వార్త జిల్లా అంతటా క్షణాల్లో మారుమ్రోగింది. మరి ఇంతకూ ఈ గోడ దుంకుడు ముచ్చటేందని మీకు ఆతృత ఉందా? మీ టెన్షన్ రిలీఫ్ కావాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టిన ముచ్చట మనకు తెలుసు కదా? దేశమంతా కాంగ్రెస్ పార్టీ కదం తొక్కింది. కొత్త ఉత్సాహం వచ్చింది. కేడర్ దుమ్మురేపిర్రు. ఆ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ లోనూ ఆ కార్యక్రమం చేపట్టేందుకు కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తం అయ్యాయి. తాము ర్యాలీ నోట్ల రద్దుకు వ్యతిరేకంగా కరీంనగర్ లో ర్యాలీ జరుపుతామని, తమ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని ఆ జిల్లా డిసిసి అధ్యక్షులు కటకం మృత్యుంజయం ఒకరోజు ముందుగానే ఎసిపి కి దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే ఆ దరఖాస్తుపై అర్థరాత్రి వరకు స్థానిక ఎసిపి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తీరా అర్థరాత్రి దానిపై నిర్ణయం చెప్పిండు. కరీంనగర్ లో నోట్ల రద్దు ర్యాలీకి అనుమతించడంలేదని వెల్లడించిండు. ఆ సమాచారాన్ని కటకం మృత్యుంజయం కు తెలియజేయడం కోసం ఒక కానిస్టేబుల్ కు అనుమతి నిరాకరణ కాయితాలు ఇచ్చి పంపిండు.

ఇక ఆ కానిస్టేబుల్ అర్థరాత్రి పూట కటకం ఇంటికిపోయిండు. బయట గేటుకు తాళం పెట్టి ఉంది. దీంతో గోడ దుంకి ఇంటి లోపలికి పోయిండు కానిస్టేబుల్. పొయిన తర్వాత కాలింగ్ బెల్ కొట్టిండు. అప్పుడు కటకం బయటకొచ్చిండు. ‘‘ఎసిపి సార్ మీకు ఈ ఆర్డర్ కాయితం ఇయ్యమన్నడు సార్’’ అని కానిస్టేబుల్ చెప్పిండు. అర్థరాత్రి ఈ నస ఏంది బై అని కటకం  ఆ కానిస్టేబుల్ మీద మస్త్ గరమైండు. గీ టైం ల గిప్పుడొచ్చుడేంది బై అని సీరియస్ అయిండు. అంతేకాదు వెంటనే ఏసిపి కి ఫోన్ చేసి సీరియస్ అయిండు. కానిస్టేబుల్ గోడ దుంకి ఇంట్లకొచ్చిండని ఫిర్యాదు కూడా చేసిండు.

అయితే ఉన్నతాధికారుల ఆదేశాలు అమలు చేసే వత్తిడిలో ఆ కానిస్టేబుల్ గోడ దుంకి వచ్చిండేమో... ఈసారికి మన్నించండి అని పోలీసు అధికారులు కటకం ను రిక్వెస్ట్ చేసిన్రు. చాలాసు బతిలాడిన తర్వాత కటకం శాంతించిండు. మొత్తానికి కానిస్టేబుల్ గోడ దుంకి ఎంత పరేషాన్ చేసిండో చూడురి. కటకం శాంతించడంతో ఈ కథ ఇలా సుఖాంతం అయింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్వాగత్ హోటల్ లో పురుగల చికెన్

ఔటర్ రింగ్ రోడ్డు మీద యాక్సిడెంట్
https://goo.gl/Tsck2C

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా