హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహల నిమజ్జనం: హైకోర్టులో తెలంగాణ సర్కార్ హౌస్ మోషన్ పిటిషన్, రేపు విచారణ

Published : Sep 12, 2021, 03:33 PM IST
హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహల నిమజ్జనం: హైకోర్టులో తెలంగాణ సర్కార్ హౌస్ మోషన్ పిటిషన్, రేపు విచారణ

సారాంశం

హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ సర్కార్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టు రివ్యూ  ఈ పిటిషన్ వేసింది.ఈ పిటిషన్ పై సోమవారం నాడు విచారణ చేస్తామని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.

హైదరాబాద్: హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ సర్కార్ ఆదివారం నాడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ పై సోమవారం నాడు విచారణ చేస్తామని తెలంగాణ  హైకోర్టు తెలిపింది.

also read:హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహల నిమజ్జనం: హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయనున్న కేసీఆర్ సర్కార్

వినాయక విగ్రహలు, దుర్గామాత విగ్రహల నిమజ్జనం  చేయకూడదని న్యాయవాది వేణుమాధవ్ పిల్ దాఖలు చేశారు.ఈ విషయమై విచారణ నిర్వహించిన హైకోర్టు హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై ఆంక్షలు విధించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయవద్దని ఆదేశించంది. చిన్న విగ్రహలు, పర్యావరణానికి ఇబ్బంది కల్గించని విగ్రహలను రబ్బర్ బండ్ ఏర్పాటు చేసి విగ్రహలను నిమజ్జనం చేయాలని హైకోర్టు ఆదేశించింది.

దీంతో హైద్రాబాద్ పోలీసులు గణేష్ నిమజ్జన ఉత్సవ కమిటీకి నోటీసులు జారీ చేశారు. హుస్సేన్ సాగర్ లో  వినాయక విగ్రహలను నిమజ్జనం చేయవద్దని ఆ నోటీసులో పేర్కొన్నారు.అయితే ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనాన్ని కొనసాగించేందుకు అనుమతివ్వాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైకోర్టును కోరారు. 

48 గంటల్లోనే హుస్సేన్ సాగర్ ను శుభ్రం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.ఇవాళ తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై రేపు విచారణ చేస్తామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ ఒక్క ఏడాది హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?