సాయిధరమ్ తేజ్‌కి రోడ్డు ప్రమాదం: అంబులెన్స్ ను పిలిపించి, నీళ్లు తాగించింది అబ్దుల్....

Published : Sep 12, 2021, 02:53 PM IST
సాయిధరమ్ తేజ్‌కి రోడ్డు ప్రమాదం: అంబులెన్స్ ను పిలిపించి, నీళ్లు తాగించింది అబ్దుల్....

సారాంశం

సీఎంఆర్ షాపింగ్ మాల్‌లోని  వ్యాలెట్ పార్కింగ్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న అబ్దుల్ అనే యువకుడు సాయిధరమ్ తేజ్  రోడ్డు ప్రమాదంలో గాయపడిన వెంటనే అంబులెన్స్ ను పిలిపించి ఆసుపత్రికి పంపాడు.  అతను సాయిధరమ్ తేజ్ అని తనకు తెలియదని అబ్దుల్ తెలిపారు.

హైదరాబాద్: సినీ నటుడు సాయిధరమ్ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడిన తర్వాత అంబులెన్స్ ను పిలిపించింది అబ్దుల్ అనే యువకుడు. ఆ సమయంలో  అబ్దుల్ కు గాయపడింది సినిమా యాక్టర్ సాయిధరమ్ తేజ్ అని కూడ తెలియదు.ఈ నెల 10వ తేదీ రాత్రి సాయిధరమ్ తేజ్ నడుపుతున్న బైక్ దుర్గుం చెరువుపై ఉన్నన తీగల వెంతెనపై బైక్ పై నుండి కింద పడ్డాడు.ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. దీంతో ఆయన ప్రస్తుతం ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

also read:సాయి ధరమ్‌ తేజ్‌: సర్జరీ సక్సెస్, అబ్జర్వేషన్ లో 24 గంటలు

నిజాంపేటలోని సీఎంఆర్ షాపింగ్ మాల్ లో వ్యాలెట్ పార్కింగ్ లో అబ్దుల్ పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని  తన స్నేహితుడితో  ఆసిఫ్ తో కలిసి ఆయన బైక్ పై వస్తున్నాడు. అదే సమయంలో  అబ్దుల్ బైక్ ను సాయిధరమ్ తేజ్ బైక్  ఓవర్ టేక్ చేసి ముందుకు వెళ్లి కిందపడింది. వెంటనే అక్కడికి చేరుకొన్న అబ్దుల్ తన స్నేహితుడితో పాటు తనకు సహాయంగా వచ్చిన వారితో కిలిసి సాయిధరమ్‌తేజ్ ను పుట్‌పాత్ పై కూర్చొబెట్టారు. నీళ్లు తాగించారు.

వెంటనే 108 కి ఫోన్ చేసి పిలిపించారు. అందేకాదు మాదాపూర్ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. సాయిధరమ్ తేజ్ ఫోన్ ను లాక్ ఓపెన్ చేసి వారి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించారు. లాక్ ఓపెన్ కాలేదు.  అయితే ఆయన పర్సులో కూడా ఎలాంటి ఫోన్ నెంబర్లు దొరకలేదు.  దీంతో పర్సును, హెల్మెట్ ను 108 సిబ్బందికి ఇచ్చారు. 

శనివారం నాడు ఎస్ఐ ఫోన్ చేసి చెప్పేవరకు తాను ఓ సినీ నటుడు సాయిధరమ్ తేజ్ ను అంబులెన్స్ లో పంపించిన విషయం తనకు తెలియదని చెప్పారు అబ్దుల్.  సాయిధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని ఎస్ఐ తనను ఫోన్ లో అడిగి తెలుసుకొన్నట్టుగా అబ్దుల్  మీడియాకు చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు