తెలంగాణ విమోచన దినం మీరు నిర్వహిస్తారా.. మేమే పర్మిషన్ తీసుకురావాలా: బండి సంజయ్

By Siva KodatiFirst Published Sep 12, 2021, 3:09 PM IST
Highlights

తెలంగాణ విమోచన దినానికి ప్రభుత్వం అధికారిక హోదా తీసుకురాలేకపోతే.. తామే కేంద్రం నుంచి తీసుకొస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోలేదని, వెంటనే పంట నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు
 

తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్. ప్రజాసంగ్రామ యాత్ర 16వ రోజు పాదయాత్ర మెదక్ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఉన్నవన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలేనని, పేరు మార్చి వాటిని అమలు చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. 

రాష్ట్రంలో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని, అసలు ప్రభుత్వం ఉందా? అని సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ విమోచన దినానికి ప్రభుత్వం అధికారిక హోదా తీసుకురాలేకపోతే.. తామే కేంద్రం నుంచి తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోలేదని, వెంటనే పంట నష్టపరిహారం చెల్లించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తన పాదయాత్రకు ప్రజల నుంచి అమోఘమైన స్పందన వస్తోందని, ఎక్కడికెళ్లినా ఆదరిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ నెల 17న జరిగే పాదయాత్రలో అమిత్ షా పాల్గొంటారని బండి సంజయ్ తెలిపారు.
 

click me!