తమ ఆదేశాలను అమలు చేశారా లేదా అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది.
హైదరాబాద్: తమ ఆదేశాలను అమలు చేశారా లేదా అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది.
గురువారం నాడు తెలంగాణ హైకోర్టుకు సీఎస్ సోమేష్ కుమార్ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల విషయంలో హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇవాళ సీఎస్ హైకోర్టుకు హాజరయ్యారు.
undefined
also read:రవికుమార్ మృతి ఎలా జరిగిందో తేల్చాలని పోలీసులను ఆదేశించాలా: హైకోర్టు
రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్టుల విషయమై హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. గతంలో కంటే ఎక్కువగా కరోనా టెస్టులు చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రకటించారు.
ఉన్నత న్యాయ స్థానం సూచన మేరకు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పూర్తి వివరాలతో హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నామని హైకోర్టుకు సీఎస్ చెప్పారు.
తెలుగులో కూడ కరోనా హెల్త్ బులిటెన్ ఇవాళ్టి నుండి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తోంది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేస్తోందా లేదా అనే విషయమై సీఎస్ ను హైకోర్టు ప్రశ్నిస్తోంది.