నేషనల్ ఎడ్యుకేషన్ పాలసి-2020... ప్రముఖులతో గవర్నర్ తమిళిసై వెబినార్

Arun Kumar P   | Asianet News
Published : Aug 13, 2020, 12:29 PM IST
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసి-2020... ప్రముఖులతో గవర్నర్ తమిళిసై వెబినార్

సారాంశం

తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ “నేషనల్ ఎడ్యుకేషన్ పాలసి-2020” పై వెబినార్ నిర్వహించారు.

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ “నేషనల్ ఎడ్యుకేషన్ పాలసి-2020” పై వెబినార్ నిర్వహించారు. “పర్ స్పెక్టివ్ ఎబౌట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసి-2020 అండ్ రోడ్ మ్యాప్ ఫర్ తెలంగాణ” అన్న అంశంపై విద్యారంగ ప్రముఖులతో గవర్నర్ వెబినార్ నిర్వహించారు. 

కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైన ఈ వెబినార్ లో యూజీసీ సభ్యులు, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటి వైస్-ఛాన్సలర్ ప్రొ. ఈ. సురేష్ కుమార్ భాషలు, నైపుణ్యాలు, ఉద్యోగిత అన్న అంశంపై ప్రసంగించనున్నారు. సెంటర్ ఫర్ ఎరనామిక్ అండ్ సోషల్ స్టడీస్ డైరెక్టర్ ప్రొ. ఈ. రేవతి ‘స్కూల్ ఎడ్యుకేషన్, సోషన్ సైన్సెస్’ అన్న అంశంపై ప్రసంగిస్తారు. 

ఉన్నత విద్యా మండలి వైస్-ఛైర్మన్ ప్రొ. వెంకట రమణ మేనేజ్ మెంట్, టెక్నాలజి, నైపుణ్యాల అభివృద్ధిపై ఉపన్యసింస్తారు. యూజీసీ సభ్యులు ప్రొ. శివరాజ్ సైన్స్ సబ్జెక్టులపై మాట్లాడతారు. నల్సార్ రిజిస్ట్రార్ ప్రొ. వి. బాలకిస్టారెడ్డి విధానపరమైన అంశాలు, లీగల్ స్టడీస్ పై అభిప్రాయాలు పంచుకుంటారు. 

అన్నా యునివర్సిటి మాజీ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఈ. బాలా గురుస్వామి విద్యావిధానంలో సంస్కరణలపై మాట్లాడుతారు. ఈ నూతన జాతీయ విద్యా విధానం ద్వారా దేశ విద్యావ్యవస్థలో, తెలంగాణ రాష్ట్ర విద్యావ్యవస్థలో రాబోయే సమూల మార్పులను ఈ వెబినార్ ద్వారా చర్చించి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?