తెలంగాణలో భారీ వర్షాలు... నిడుకుండలా నీటిపారుదల ప్రాజెక్టులు

By Arun Kumar PFirst Published Aug 13, 2020, 12:05 PM IST
Highlights

గతకొద్దిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని  హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

హైదరాబాద్: గతకొద్దిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని  హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లోనూ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. 

 కడెం, ఎల్లంపల్లి, కొమురంభీం ప్రాజెక్టుల్లోకి  భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఇన్ ఫ్లో పెరిగింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు చేరుతోంది. ఈ కాళేశ్వరంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. 

కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్మారేజిలో 3లక్షల 76వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వుండగా  3లక్షల 99వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో వుంది. ప్రస్తుతం ఈ బ్యారేజీలో 9.166టీఎంసీల నీటి నిల్వ వుంది. అధికారులు ప్రాజెక్టు 57 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు.  
 

click me!