రేపు ట్యాంక్ బండ్ లో వినాయక విగ్రహల నిమజ్జనం: మూడు జిల్లాలకు సెలవులు

By narsimha lodeFirst Published Sep 8, 2022, 4:06 PM IST
Highlights

రేపు వినాయక విగ్రహల నిమజ్జనాన్ని పురస్కరించుకొని రేపు మూడు జిల్లాలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఈ మేరకు ఇవాళ  ఉత్తర్వులు  జారీ చేసింది.

హైదరాబాద్: గణేష్ విగ్రహల నిమజ్జనాన్ని పురస్కరించుకొని రేపు తెలంగాణలోని మూడు జిల్లాలకు సెలవులు ప్రకటించారు.హైద్రాబాద్ ట్యాంక్ బండ్ పై రేపు గణేష్ విగ్రహలను నిమజ్జనం చేయనున్నారు. దీంతో హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ  కార్యాలయాలు,  విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.

గణేష్ విగ్రహల నిమజ్జనం  కోసం జీహెచ్ఎంసీ అధికారులు  ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం నుండి వినాయక విగ్రహల నిమజ్జనం కొనసాగుతుంది.  ఎల్లుండి ఉదయం వరకు వినాయక విగ్రహల శోభాయాత్ర కొనసాగే అవకాశం ఉంది.  ఖైరతాబాద్ గణేష్ వినాయక విగ్రహం నిమజ్జనం పూర్తి చేయడంతో  శోభాయాత్రలో ప్రధాన ఘట్టం పూర్తి అవుతుంది.

ట్యాంక్ బండ్ పై ఇప్పటికే క్రేన్ ల ఏర్పాటు పూర్తైంది. వినాయక విగ్రహల నిమజ్జనం ఏర్పాట్లను తెలంగాణ  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ నిన్న పరిశీలించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న పరిశీలించారు. ఏర్పాట్లపై బండి సంజయ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

also read:రేపే వినాయక విగ్రహల నిమజ్జనం: ట్యాంక్ బండ్ వద్ద జీహెచ్ఎంసీ ఏర్పాట్లు

ట్యాంక్ బండ్ లో వినాయక విగ్రహల నిమజ్జనం ఏర్పాట్లపై ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం లేదని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి గతంలో ఆరోపణలు చేసింది.ఈ విషయమై బైక్ ర్యాలీ కూడా తలపెట్టింది. అయితే ఈ బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు వినాయక విగ్రహల నిమజ్జనం విషయంలో ట్యాంక్ బండ్ వద్దే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. పండుగలను కూడా రాజకీయంగా వాడుకోవడం సరైంది కాదని  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
 

click me!