రేషన్ కార్డు లేకుంటే రైతు బంధు కట్:తెలంగాణ సర్కార్ నిబంధన?

By narsimha lode  |  First Published Dec 27, 2023, 9:46 AM IST

రేషన్ కార్డుతో రైతు బంధుకు  లింక్ చేసింది తెలంగాణ సర్కార్. రేషన్ కార్డు లేకపోతే  రైతు బంధు నిధులు  జమకావనే ప్రచారం సాగుతుంది.



హైదరాబాద్: రేషన్ కార్డు లేకపోతే రైతు బంధు  కట్ కానుంది.గతంలో మాదిరిగా  రైతుబంధు కింద పెట్టుబడి సహాయం పొందాలంటే లబ్దిదారులకు  రేషన్ కార్డు ఉండాల్సిందే.  గతంలో రేషన్ కార్డులతో  సంబంధం లేకుండానే  రైతుబంధు  సహాయం అందేది.  కానీ, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన  కాంగ్రెస్ సర్కార్  రైతు బంధుకు  రేషన్ కార్డును లింక్ చేయనుంది. 

గతంలో  తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న  భారత రాష్ట్ర సమితి సర్కార్  రైతు బంధు పేరుతో రైతులకు పెట్టుబడి సహాయం అందించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం పేరుతో  ప్రతి ఏటా ఎకరానికి రూ. 15 వేలను అందించనుంది.  ఈ నెల  28 నుండి జనవరి  6 లోపుగా  గ్రామ సభల్లో  రైతులు ఈ పథకం కోసం ధరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్నవారే ఈ పథకం కింద ధరఖాస్తు చేసుకోనేందుకు వీలుంది.

Latest Videos

also read:తెలంగాణ అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఎవరు?:రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డిలలో ఎవరికి దక్కునో

 అయితే  కొత్త రేషన్ కార్డుల కోసం  ఈ నెల  28 నుండి జనవరి 6వ తేదీ లోపుగా ప్రజా పాలనలో ధరఖాస్తు చేసుకోవచ్చు. రైతు బంధు పథకానికి రేషన్ కార్డును లింక్ నిబంధన పెట్టడంతో  సుమారు  70 లక్షల మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో  పోస్టులు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం వాస్తవమేనా, లేదా అనేది స్పష్టత కావాల్సి ఉంది.  అదే నిజమైతే  రైతు బంధు లబ్దిదారులకు ఇబ్బందులు తప్పవు.

also read:ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ వైభవం కోసం: వై.ఎస్. షర్మిలతో కాంగ్రెస్ స్కెచ్ మామూలుగా లేదుగా.

ఈ ఏడాది నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు బంధు నిధుల విడుదల విషయంలో ట్విస్టుల మీద ట్బిస్టులు చోటు చేసుకున్నాయి.  రైతు బంధు నిధుల విషయంలో ఎన్నికల ప్రచార సభలో  హరీష్ రావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రైతు బంధు నిధుల విడుదలను నిలిపివేయాల్సి వచ్చిందని అప్పట్లో  రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.  రైతు బంధు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్నికల సంఘం వెంటనే  నిధుల విడుదలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.ఈ విషయమై అప్పట్లో భారత రాష్ట్ర సమితి నేతలు కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. 
 

click me!