గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్‌‌పై హైకోర్టు ఆదేశాలు: సుప్రీంలో తెలంగాణ సర్కార్ సవాల్

By narsimha lodeFirst Published Oct 8, 2021, 10:23 AM IST
Highlights

గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ను బాట సింగారం తరలింపు విషయంలో  హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను  దసరా సెలవుల తర్వాత సుప్రీంకోర్టు విచారణ చేయనుంది.

హైదరాబాద్:  గడ్డి అన్నారం  ఫ్రూట్ మార్కెట్ ‌ను  బాట సింగారం తరలింపు విషయంలో   హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

also read:గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్‌లో వ్యాపారాలకు గ్రీన్ సిగ్నల్: ఈ నెల 18 వరకు హైకోర్టు అనుమతి

 Gaddiannaram fruit market స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ  ఫ్రూట్ మార్కెట్ ను bata singaram గ్రామ పరిధిలోకి మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఫ్రూట్ మార్కెట్ కమీషన్ ఏజంట్స్ అసోసియేషన్  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై   telangana high court  విచారించింది. ఈ నెల 18వ తేదీ వరకు వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారంనాడు ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం supremeను కోరింది. ఈ పిటిషన్ పై  విచారణ అత్యవసరం కాదని  సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.  దసరా సెలవుల తర్వాత ఈ పిటిషన్ పై విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు తెలిపింది.

hyderabadలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆసుపత్రులు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.  ప్రస్తుతమున్న ఆసుపత్రులతో పాటు మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రలను నిర్మించనుంది.ఈ ఆసుపత్రుల నిర్మాణం కోసం స్థలాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ స్థలంలో ఆసుపత్రిని నిర్మించాలని నిర్మించనున్నారు. మరో రెండు ఆసుపత్రుల కోసం స్థలాల కోసం ప్రభుత్వం అన్వేషణ చేస్తోంది.

click me!