కరోనా వ్యాక్సినేషన్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

By narsimha lodeFirst Published May 25, 2021, 4:17 PM IST
Highlights

కరోనా వ్యాక్సిన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొంది. పనిచేసే ప్రదేశాల్లో 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది.

హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొంది. పనిచేసే ప్రదేశాల్లో 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది.18 ఏళ్లు దాటిన వారంతా  ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ వేసుకొనేందుకు కేసీఆర్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రైవేట్ ఆసుపత్రులకు కూడ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వ్యాక్సిన్ కోసం ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ ఆసుపత్రులతో  సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. 

also read:10 రోజుల తర్వాత తెలంగాణలో ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్: రెండో డోసు వారికే

10 రోజుల తర్వాత రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. అయితే రెండో డోసు వేసుకొనేవారికే అవకాశం కల్పించింది. మొదట డోసు వేసుకొనేవారికి అవకాశం లేదు. అయితే వ్యాక్సిన్ కొరత కారణంగా రాష్ట్రంలో 10 రోజులుగా వ్యాక్సినేషన్ నిలిచిపోయింది.రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు చేస్తోంది. ఈ నెలాఖరువరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. ఈ నెల 28న సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి లాక్‌డౌన్ పై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 
 

click me!