నేను ఈటలను కలవలేదు, ఫోన్లో మాట్లాడానంతే.... కిషన్ రెడ్డి క్లారిటీ..

By AN TeluguFirst Published May 25, 2021, 3:52 PM IST
Highlights

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎపిసోడ్ మీద కేంద్ర మంతి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనను కలిసేందుకు ఈటెల సంప్రదించిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు తాను ఈటలను కలవలేదు, ఫోన్లో మాత్రమే మాట్లాడానని చెప్పారు. భవిష్యత్తులో ఈటలతో చర్చలు జరుపుతానన్నారు. 

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎపిసోడ్ మీద కేంద్ర మంతి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనను కలిసేందుకు ఈటెల సంప్రదించిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు తాను ఈటలను కలవలేదు, ఫోన్లో మాత్రమే మాట్లాడానని చెప్పారు. భవిష్యత్తులో ఈటలతో చర్చలు జరుపుతానన్నారు. 

అసెంబ్లీలో ఈటలో కలిసి పదిహేనేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నానన్నారు. ఈటల రాజేందర్ ను ఎప్పుడు కలవాలనేది నిర్ణయించుకోలేదని చెప్పారు. అందర్నీ కలుస్తున్నాను. తనను కూడా కలుస్తానని ఈటల అన్నారన్నారు. హుజూరాబాద్ కు ఉప ఎన్నిక వస్తే పోటీ చేయాలా, లేదా అనేది అధిష్టానంతో చర్చించలేదన్నారు. 

బీజేపీలో గ్రూపులో ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి ఎలా తెలుసు? అని ప్రశ్నించారు. తాను కేసీఆర్ కు అనుకూలమని ప్రచారం చేసే వాళ్లను దేవుడే చూసుకుంటాడన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ పనుల కోసం ఢిల్లీకి వచ్చే వారికి ఖచ్చితంగా సాయం చేస్తానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

కాగా, మంత్రి పదవి నుంచి ఈటలను బర్తరఫ్ చేసిన తర్వాత ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు పెద్దలు ఆయనతో చర్చించడం, తాజాగా బీజేపీ జాతీయ నేతే హైదరాబాద్‌కు వచ్చి చర్చలు జరపడంతో మరోసారి ఈటెల రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. 

ఈటల రాజేందర్ తో బీజేపీ జాతీయ నేత భూపేందర్ యాదవ్ చర్చలు జరిపారు. సుమారు రెండు గంటలపాటు ఈటెలతో పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫాం హౌస్ లో జరిగిన ఓ సమావేశంలో ఈటెలతో కలిసి బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇదే సమావేశంలో భూపేందర్ యాదవ్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ ను పార్టీలోకి రావాలని బీజేపీ నేతలు ఆహ్వానించారు. అయితేబిజెపిలో చేరే అంశంపై ఈటెల రాజేందర్ స్పష్టత ఇవ్వలేదు. పార్టీలోకి వస్తే కీలక పదవి ఇస్తామని కూడా చెప్పినట్లు తెలియవచ్చింది. ఈ ఆహ్వానంపై ఇంతవరకు ఈటెలస్పందించలేదు.

మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం పైనే కాకుండా, ముఖ్యమంత్రి కెసిఆర్ పైన ఎదురుదాడికి దిగిన క్రమంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా కొనసాగే ఉద్దేశం తనకు లేదని సమాచారం. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక ఈటెల  కొత్త పార్టీ పెడతారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. 

కానీ, ఇంట గెలిచాకే రచ్చ గెలవాలని ఆలోచనతో ఆయన ఉన్నారని తెలుస్తోంది. రాజీనామాతో హుజురాబాద్ కు ఉప ఎన్నిక తీసుకువచ్చి, అక్కడ గెలిచి టిఆర్ఎస్ కు సవాల్ విసరాలని, ఆపై కలిసి వచ్చే వ్యక్తులు, శక్తులతో కలిసి ముందుకు సాగాలని ఉద్దేశంగా చెబుతున్నారు.

click me!