నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త : రెండో విడతలో 3,334 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్... ఏ శాఖలో ఎన్నంటే

Siva Kodati |  
Published : Apr 13, 2022, 09:34 PM IST
నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త : రెండో విడతలో 3,334 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్... ఏ శాఖలో ఎన్నంటే

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా రెండో విడతలో పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్ధిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా ఫైర్ సర్వీసు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ శాఖల్లోని 3,334 ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది.    

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తొలి విడతలో 30,453 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ బుధవారం తాజాగా మరో 3,334 ఉద్యోగ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో 80,039  ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు తొలి విడతగా 30,453 ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియకు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా ఫైర్ సర్వీసు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ శాఖల్లోని 3,334 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. మిగతా శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.  

కాగా.. ఉద్యోగాల భర్తీకి (notifications for recruitment) సంబంధించి అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ (kcr) కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.  దీనికి అనుగుణంగా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి (sabitha indra reddy) , శ్రీనివాస్‌గౌడ్‌ (srinivas goud) సభ్యులుగా ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు (harish rao) నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం.. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ (somesh kumar) , ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అధికారులతో పలు దఫాలుగా చర్చించింది. దీనిలో భాగంగా తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేసీఆర్ ప్రకటించిన మొత్తం 80,039 ఉద్యోగాలకు గాను తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ బుధవారం ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి తదుపరి ప్రక్రియకు సంబంధించి నియామక సంస్థలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

గ్రూప్‌-1లో 503 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు ఆర్ధిక శాఖ అనుమతించింది.  అలాగే పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా జైళ్లశాఖలో 154 పోస్టులు, పోలీసు శాఖలో 16,587 పోస్టులు భర్తీ చేయనున్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా జైళ్లశాఖలో 31 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, వైద్యారోగ్యశాఖలో 2,662 పోస్టులు, డిప్యూటీ కలెక్టర్‌- 42, డీఎస్పీలు-91, ఎంపీడీవో-121, వైద్యారోగ్యశాఖ పాలనాధికారులు -20, వాణిజ్య పన్నులశాఖలో 48, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ -38, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌-40 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఆర్థికశాఖ తాజాగా విడుదల చేసింది. దీనికి అనుగుణంగా టెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆయా శాఖల మంత్రులు, అధికారులతో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు చర్చించి మిగిలిన ఉద్యోగాలకు అనుమతి ఇవ్వనున్నారు.  

రాష్ట్రంలో తక్షణమే  80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో మొత్తం 91,142 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని చెప్పిన కేసీఆర్.. వారికి శుభవార్త అందించారు. మొత్తం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తున్నట్టుగా కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

Tallest Building in Hyderabad : హైదరాబాద్ లో అతిపెద్ద హైరైజ్ టవర్ ఏది? అత్యంత ఎత్తైన టాప్ 10 భవనాలివే
Health: ఉచితంగా కంటి ప‌రీక్షల శిబిరం.. నెల‌రోజుల పాటు అవ‌కాశం, ఎక్క‌డంటే.?