ప్రైవేట్ స్థలంలో విగ్రహాల ఏర్పాటు ... ప్రశ్నించినందుకు, తల్లీకొడుకుల్ని సజీవ సమాధి చేసే యత్నం

Siva Kodati |  
Published : Apr 13, 2022, 08:46 PM ISTUpdated : Apr 13, 2022, 08:48 PM IST
ప్రైవేట్ స్థలంలో విగ్రహాల ఏర్పాటు ... ప్రశ్నించినందుకు, తల్లీకొడుకుల్ని సజీవ సమాధి చేసే యత్నం

సారాంశం

ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. తమ స్థలంలో విగ్రహాలు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించినందుకు తల్లీకొడుకుల్ని బతికుండగానే సజీవ సమాధి చేయబోయారు కొందరు వ్యక్తులు. 

నేతల విగ్రహాల కోసం  తల్లీకొడుకుల్ని సజీవ సమాధి చేయడానికి సిద్ధమయ్యారు కొందరు. తాము ఇళ్లు కట్టుకోవాల్సిన స్థలం ఎదుట విగ్రహాలు ఎలా పెడతారని ప్రశ్నించినందుకు దౌర్జన్యానికి దిగారు. ఖమ్మం జిల్లా (khammam district) తిరుమలాయపాలెం మండలం (tirumalayapalem) జల్లేపల్లిలో ఈ దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ స్థలం ఎదుట విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు కొందరు వ్యక్తులు గోతులు తవ్వారు. అయితే విగ్రహాల ఏర్పాటును స్థల యజమానితో పాటు ఆమె కుమారుడు వ్యతిరేకించారు. పునాదుల కోసం తవ్విన గోతుల్లో దిగి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వాళ్లుండగానే గోతుల్లో రాళ్లు నింపే యత్నం చేశారు కొందరు గ్రామస్తులు . అయితే  కొంతమంది కలగజేసుకుని వాళ్లను బయటకు తీశారు. అయితే మిగిలిన వారు తల్లీ కొడుకుల్ని పక్కకు ఈడ్చిపారేశారు. చివరికి ఖమ్మం రూరల్ ఏసీపీకి తమ గోడు చెప్పుకున్నారు బాధితులు. 
 

PREV
click me!

Recommended Stories

కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!