
టీపీసీసీ (tpcc) మాజీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై (uttam kumar reddy) ఫైరయ్యారు హుజుర్‌నగర్ (huzurnagar) టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి (sanampudi saidi reddy) . వచ్చే ఎన్నికల్లో హుజుర్ నగర్ నుంచి ఉత్తమ్ పోటీ చేస్తానంటున్నారని... అయితే ఆయనను ఓడించి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తానని సైదిరెడ్డి సవాల్ విసిరారు. ఉత్తమ్‌కు సీటు ఇవ్వాలని రేవంత్ రెడ్డిని కోరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని చిత్తుగా ఓడిస్తానని సైదిరెడ్డి స్పష్టం చేశారు.
కాగా.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్‌నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. అయితే 2019 ఏప్రిల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. దీంతో ఉత్తమ్ కుమార్ రె్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీమామా చేశారు. ఈ నేపథ్యంలో హుజుర్‌నగర్‌లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య పద్మావతిని బరిలోకి దింపగా.. ఆమె ఘోర పరాజయం పాలయ్యారు.
టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డికి 1,12,796 ఓట్లు రాగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డికి 69,563 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్ధి కోట రామారావు, టీడీపీ అభ్యర్ధి చావా కిరణ్మయికి 1827 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తర్వాత మూడో స్థానంలో సుమన్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థికి 2693 ఓట్లు వచ్చాయి. సుమన్ కంటే టీడీపీ, బీజేపీ అభ్యర్ధులకు తక్కువ ఓట్లు రావడం విశేషం. 2009 నుండి ఈ స్థానం నుండి హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తూ.. కాంగ్రెస్‌కు కంచు కోటగా మలిచారు.